E-Paper
Advertisement

Police Released Artist Hema’s Photo: దొంగ దొరికిందోచ్.. రేవ్ పార్టీలో లేనన్న హేమ.. ఫోటో విడుదల చేసిన బెంగుళూరు పోలీసులు

Police Released Artist Hema’s Photo: దొంగ దొరికిందోచ్.. రేవ్ పార్టీలో లేనన్న హేమ.. ఫోటో విడుదల చేసిన బెంగుళూరు పోలీసులు
Advertisement

Police Released Rave Party Hema’s Photo: సోమవారం ఉదయం నుంచీ ఒకటే బ్రేకింగ్ న్యూస్. అదే బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ. అక్కడ పోలీసులకు చిక్కిన కొందరు టాలీవుడ్ సెలబ్రిటీలు, స్పాట్ లో ఉన్న కారులో ఏపీకి చెందిన ఎమ్మెల్యే పాస్ పోర్టు లభ్యమవ్వడం.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనానికి దారితీశాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీకి సమీపంలో ఉన్న జీఆర్ ఫామ్ హౌస్ లో హైదరాబాద్ కు చెందిన వాసు అనే వ్యక్తి బర్త్ డే పార్టీ పేరుతో భారీగా రేవ్ పార్టీని నిర్వహించాడు. ఈ పార్టీకి హైదరాబాద్ నుంచి యువతీ, యువకులను స్పెషల్ గా ఫ్లైట్ లో బెంగళూరుకు తరలించాడు.

ఈ పార్టీకి 100 మందికి పైగా హాజరవ్వగా.. వారందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్టీకి హాజరైన ప్రముఖుల్లో టాలీవుడ్ కు చెందిన హేమ, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సహా పలువురు ఉన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఇలా మీడియాలో కథనాలొచ్చాయో లేదో.. అలా హేమ నేను హైదరాబాద్ లోనే ఉన్నానంటూ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఇక్కడ వరకూ బాగానే ఉంది. తాను హైదరాబాద్ లోనే ఉన్నానని వీడియో చేసిన హేమకు పోలీసులు మైండ్ బ్లాంక్ అయ్యే షాకిచ్చారు.

Advertisement

Also Read: నేను హైదరాబాద్ లోనే ఉన్నాను.. నాకు ఏ రేవ్ పార్టీతో సంబంధం లేదు: నటి హేమ

హేమ రిలీజ్ చేసిన వీడియోలోనూ.. పార్టీలో దొరికారని పోలీసులు విడుదల చేసిన ఫొటోలోనూ హేమ సేమ్ డ్రస్ లో కనిపించింది. అంతే కాదు. పార్టీ జరిగిన బిల్డింగ్ వద్ద ఉన్న బ్యాగ్రౌండ్ కూడా హేమ చేసిన వీడియోలో మ్యాచ్ అవుతుంది. ఇప్పుడిదే నెట్టింట వైరల్ అవుతోంది. అటు కన్నడ మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో, తెలుగు మీడియాలో వచ్చిన వార్తల్లో నిజం లేదని చెప్పిన హేమకు.. పోలీసులు ఇలా షాకిచ్చారు.

Advertisement

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×