E-Paper
Advertisement

Devara 2Days Collections: సునామీ సృష్టించిన ఎన్టీఆర్.. వీకెండ్ కలిసొస్తోందా..?

Devara 2Days Collections: సునామీ సృష్టించిన ఎన్టీఆర్.. వీకెండ్ కలిసొస్తోందా..?
Advertisement

Devara 2Days Collections.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో యంగ్ టైగర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. బ్రహ్మర్షి విశ్వామిత్ర , బాల రామాయణం చిత్రాలలో బాల నటుడిగా నటించి అందరిని మెప్పించిన ఈయన, నిన్ను చూడాలని అనే సినిమాతో సోలో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమా పెద్దగా గుర్తింపు అందివ్వలేదు. కానీ ఆ తర్వాత వచ్చిన సింహాద్రి, స్టూడెంట్ నెంబర్ వన్ , ఆది లాంటి చిత్రాలు ఎన్టీఆర్ కు మంచి మాస్ ఇమేజ్ ను సంపాదించి పెట్టాయి.

కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న దేవర..

Advertisement

ఇక ఇప్పుడు ఏకంగా గ్లోబల్ స్టార్ అయిపోయారు ఎన్టీఆర్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా భారీ పాపులారిటీ అందుకున్న ఎన్టీఆర్ , ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాతో మన ముందుకు వచ్చారు. సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మొదటిరోజు భాగంగా రూ. 172 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించిన ఈ సినిమా.. రెండు రోజుల్లోనే ఏకంగా రూ.243 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. మొత్తానికైతే ” దేవర కెరటం బాక్సాఫీస్ ను ముంచెత్తింది.. అన్ని ప్రాంతాలకు హెచ్చరికలు పంపింది” అంటూ ఒక పోస్టర్ ను చిత్ర బృందం పంచుకుంది. ఇక ఈరోజు సెలవు కావడంతో ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

ఎన్టీఆర్ సినిమాలు..

Advertisement

మొత్తానికి అయితే సోలో హీరోగా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను వసూలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు ఎన్టీఆర్. ఇక ఎన్టీఆర్ తదుపరి చిత్రాల విషయానికొస్తే కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ దేవర చిత్రానికి సీక్వెల్ కూడా ఉంది. అయితే ఈ సీక్వెల్ ప్రారంభించడానికి ఇంకా సమయం పట్టవచ్చు అని సమాచారం. ఈలోపు కే జి ఎఫ్ చిత్రాలతో పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యారు చిత్ర బృందం. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ దేవర సీక్వెల్ చేసే పనిలో బిజీ కానున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే రాజమౌళి సినిమా తర్వాత సోలో హీరోగా ఇండస్ట్రీకి వచ్చి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారని చెప్పవచ్చు.

అభిమాని కోరిక తీర్చిన ఎన్టీఆర్..

ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే.. హీరో గానే కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా కూడా పేరు సొంతం చేసుకున్నారు. అభిమానులకు ఆర్థికంగా అండగా నిలుస్తూ వారి కోసం ఏం చేయడానికైనా సిద్ధం అన్నట్టుగా నిరూపిస్తున్నారు. ఇటీవలే ఒక అభిమాని క్యాన్సర్ తో పోరాడుతున్నారు. ఎలాగైనా దేవర సినిమా చూసే వరకైనా తనను బ్రతికించండి అంటూ వైద్యులను వేడుకొన్నారు. దీంతో ఈ విషయం కాస్త ఎన్టీఆర్ వరకు వెళ్లడంతో ఎన్టీఆర్ స్వయంగా అభిమానితో వీడియో కాల్ మాట్లాడి అభిమానిని సంతోషపరిచారు. ఇలా ఎన్నో విషయాలలో ఎన్టీఆర్ మంచి మనసున్న వ్యక్తిగా పేరు దక్కించుకోవడం గమనార్హం.

Tags

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×