Team India squad for Bangladesh T20 Series: టీం ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య ప్రస్తుతం రెండో టెస్ట్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి నేపథ్యంలో… బంగ్లాదేశ్ తో త్వరలోనే జరగనున్న మూడు టి20 సిరీస్ కు కూడా భారత జట్టును ఫైనల్ చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. సూర్య కుమార్ యాదవ్ కు కెప్టెన్సీ అప్పగించిన బిసిసిఐ పాలకమండలి… 15 మందితో కూడిన జట్టును ప్రకటించేసింది.
శనివారం రోజు రాత్రి పూట ఈ జట్టును.. అధికారికంగా ప్రకటించింది బీసీసీఐ పాలకమండలి. అయితే బంగ్లాదేశ్ తో టి20 సిరీస్ కు తెలుగు కుర్రాడు, సన్రైజర్స్ హైదరాబాద్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి కూడా చోటు దక్కించుకోగలిగాడు. జులై మాసంలో జరిగిన టి20 సిరీస్ కు నితీష్ కుమార్ ఎంపికై గాయం కారణంగా దూరమయ్యాడు. అందుకే మరోసారి తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చింది బీసీసీఐ పాలకమండలి.
Also Read: IPL Mega Auction: 5+1 RTM కార్డ్..ఐపీఎల్ రిటెన్షన్ రూల్స్ ఇవే..ధోనికి రూట్ క్లియర్!
ఇక అటు వరుసగా విఫలమవుతున్న సంజు సాంసన్ కు మరోసారి అవకాశం ఇచ్చింది. ఇటీవల టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంతుకు రెస్ట్ ఇచ్చిన బిసిసిఐ పాలక మండలి… కీపర్ గా సంజు ను ఎంపిక చేసింది. అటుగిల్ అలాగే యశస్వి జైస్వాల్ కు కూడా విశ్రాంతి ఇచ్చింది. యంగ్ క్రికెటర్స్ అభిషేక్ శర్మ, హర్షిత్ రానా అలాగే మయాంక్ యాదవ్ కు జట్టులో అవకాశం కల్పించడం జరిగింది. కాగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఇప్పటికే ఒక టెస్ట్ విజయం సాధించిన టీమిండియా… రెండో టెస్టు ఆడుతోంది.
Also Read: Musheer Khan: సర్ఫరాజ్ సోదరుడు ముషీర్ కు ఘోర రోడ్డు ప్రమాదం…క్రికెట్ కు దూరం !
టీ20 సిరీస్ కోసం భారత జట్టు ఇదే
Team India squad for Bangladesh T20 Series: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అర్ష్దీప్ సింగ్, రానా మరియు మయాంక్ యాదవ్