E-Paper
Advertisement

Devara: ఆయుధ పూజ సాంగ్ వచ్చేసిందిరోయ్.. థియేటర్ లో పూనకాలు ఖాయంరోయ్

Devara: ఆయుధ పూజ సాంగ్ వచ్చేసిందిరోయ్.. థియేటర్ లో పూనకాలు ఖాయంరోయ్
Advertisement

Devara: మ్యాన్ ఆఫ్ మ్యాసెస్  ఎన్టీఆర్, జాన్వీ  కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వం వహించిన చిత్రం దేవర.  ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా రేపు.. అనగా సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను  విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా అంచనాలను పెంచేసింది.

దేవర సినిమా ప్రమోషన్స్  మొదలైనప్పటినుంచి ఆయుధ పూజ సాంగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని మేకర్స్ చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఆయుధ పూజ సాంగ్ ఎప్పడెప్పుడు వస్తుందా.. ? అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

Advertisement

ఇక తాజాగా  దేవర జ్యూక్ బాక్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో ఆయుధ పూజ సాంగ్ ను కూడా యాడ్ చేశారు. ఆయుధ పూజ సాంగ్ కు థియేటర్ లో పూనకాలు ఖాయం అని చెప్పొచ్చు. అనిరుధ్ మ్యూజియం ఇచ్చిపడేశాడు.  ఎర్రటి సంద్రం ఎగిసి పడే.. అద్దిరి ఇద్దిరి అదిరిపడే హోరు.. రణధీరుల పండుగ నేడు అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.  ఈ సాంగ్ కు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. కాల  భైరవ తన బేస్ వాయిస్  తో ఆలపించాడు.

ఇక ఈ సాంగ్ లో  రణధీరులుగా  ఎన్టీఆర్, సైఫ్,  శ్రీకాంత్ మొత్తం డ్యాన్స్ చేస్తూ కనిపించినట్లు తెలుస్తోంది.  లిరిక్స్ ను బట్టి సముద్రంలో వేటకు వెళ్లేముందు గ్రామస్తులు అందరు కలిసి చేసే ఆచారంలా కనిపిస్తుంది. ఎప్పటినుంచో ఆయుధ పూజ సాంగ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు.. నిరాశపడకుండానే అనిరుధ్ మ్యూజిక్ ను అందించినరట్లు కనిపిస్తోంది. సాంగ్ మొత్తం ఎక్కడా స్లో అవ్వకుండా మంచి హైప్ ను క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరి దేవర సినిమా ఎన్టీఆర్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Advertisement

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×