E-Paper
Advertisement

Devara: భైర గ్లింప్స్.. ఆచార్యను రిపీట్ చేయడం లేదు కదా కొరటాల మావా.. ?

Devara: భైర గ్లింప్స్.. ఆచార్యను రిపీట్ చేయడం లేదు కదా కొరటాల మావా.. ?
Advertisement

Devara: ఎప్పుడెప్పుడు దేవర థియేటర్ లో రిలీజ్ అవుతుందా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. నిజం చెప్పాలంటే ఈ సినిమాపై ఇద్దరి జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ఎన్టీఆర్, కొరటాల శివ. వీరిద్దరూ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్నారు. దానికి ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. రాజమౌళి తో సినిమా తీసాకా ఏ హీరోకు అయినా తరువాత వచ్చేహ్ సినిమా అట్టర్ ప్లాప్ అవుతుంది. అది ఒక సెంటిమెంట్ గా మారింది.

రెండేళ్ల క్రితం ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ లో నటించాడు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక అలాంటి హిట్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర. రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేసి ఎలాగైనా దేవరతో హిట్ అందుకోవాలని ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నాడు.

Advertisement

ఇంకోపక్క కొరటాల శివ. కెరీర్ మొదలుపెట్టిన దగ్గరనుంచి పరాజయమే చవిచూడని డైరెక్టర్ గా అభిమానులు ఆయనను నెత్తిన పెట్టుకున్నారు. ఆయన దర్శకత్వంలో చిరంజీవి సినిమా అని అనౌన్స్ చేయగానే.. బాక్సాఫీస్ షేక్ అని అనుకున్నారు. కానీ, ఆచార్య రిలీజ్ అయ్యాక.. ఎవరైతే పొగిడారో.. వారే కొరటాలను విమర్శలతో ముంచెత్తారు. చిరు సైతం ఇన్ డైరెక్ట్ గా కొరటాలదే తప్పు అన్నట్లు చూపించాడు.

ఇక చేసేది ఏమి లేక కొరటాల.. తన తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టాడు. అదే దేవర. ఎలాగైనా ఈ సినిమాతో హిట్ కొట్టి ఆ పాదఘట్టం మరకలను చెరిపేయాలని చూస్తున్నాడు. ఇలా వీరిద్దరి జీవితాలు దేవర సినిమాపై ఆధారపడి ఉన్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను బాగానే మెప్పించాయి. ఈరోజు సైఫ్ ఆలీఖాన్ పుట్టినరోజు కావడంతో.. దేవర నుంచి ఒక స్పెషల్ గ్లింప్స్ ను రిలీజ్ చేసి సైఫ్ కు బర్త్ డే విషెస్ తెలిపారు.

Advertisement

ఇక ఈ గ్లింప్స్ చూసిన అభిమానులు.. ఆచార్యను గుర్తుచేసుకొని భయపడుతున్నారు. అందుకు కారణం.. ఆచార్యలోని విలన్ సోనుసూద్ విలన్ లుక్.. దేవర లోని భైర లుక్ సేమ్ ఉండడమే. దీంతో ఆచార్యను రిపీట్ చేయడం లేదు కదా కొరటాల మావా.. ? అని ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు. భైరగా సైఫ్ అదిరిపోయాడు. ఆ కండలు, యాక్షన్, ఫైట్స్ ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా ఆచార్యలో చూపించా విధంగానే ఒక ఊరు.. అందులో భైర ఆగడాలు.. దేవర  రావడం.. ఇలా మొత్తం ఆ సినిమానే గుర్తుచేస్తున్నాయి.

ఇకపోతే దేవరకు ధీటుగా భైర విలనిజం ఉంటుందని తెలుస్తోంది. అయితే.. ఇప్పటినుంచే ఇలాంటి నెగెటివ్ వైబ్ ను క్రియేట్ చేయకుండా.. సినిమా వచ్చేవరకు ఆగితే బావుంటుందని మరికొందరు చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో ఈ ఇద్దరు ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×