BigTV English

Saudi Prince: ఘోరంగా భయపడుతున్న సౌదీ యువరాజు.. ‘నన్ను చంపేస్తారు.. కాపాడండి’ అంటూ వేడుకోలు

Saudi Prince: ఘోరంగా భయపడుతున్న సౌదీ యువరాజు.. ‘నన్ను చంపేస్తారు.. కాపాడండి’ అంటూ వేడుకోలు

Saudi Prince life in Danger?: ఆయనొక దేశానికి యువరాజు. రాజు అంటే ఎలా ఉంటది. ఆయనపై ఈగ కూడా వాలనివ్వదు ఆయన చుట్టూ ఉండే సెక్యూరిటీ. కానీ, ఈ యువరాజు మాత్రం ఇప్పటివరకు ఏ రాజు కూడా మాట్లాడని విధంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు భయమేస్తుందని చెప్పుకొచ్చారు. తనని చంపేస్తారని.. తనకు సహాయం చేయండంటూ వేడుకున్నాడు. అది కూడా మరో దేశ చట్ట సభ్యులతో ఇలా గోడు వెల్లబోసుకున్నాడు. ఈ విషయాన్ని ఆ దేశానికి సంబంధించిన ఓ వైబ్ సైట్ పేర్కొన్నది. దీంతో ప్రస్తుతం ఈ అంశం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. ఇందుకు సంబంధించి ఇతర మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం..


సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ తన భద్రతకు సంబంధించిన ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా చట్ట సభ సభ్యులతో తన గోడును వెల్లబోసుకున్నాడు. తనని ప్రత్యర్థులు ఏ క్షణంలోనైనా చంపేయొచ్చు.. తనకు భయమేస్తుందంటూ ఆయన చెప్పుకొచ్చాడంటా. తన వ్యక్తిగత భద్రతకు సంబంధించి ఆ యువరాజు ఆందోళన వ్యక్తం చేయడంతో ప్రస్తుతం సౌదీ అరేబియా రాజకీయ స్థిరత్వంపై పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి.

ఇందుకు సంబంధించి అమెరికాకు చెందిన ఓ వెబ్ సైట్ నివేదించింది. అందులో పేర్కొన్న వివరాలు ప్రకారం.. ఇజ్రాయెల్ తో శాంతి ఒప్పందం తన ప్రాణాల మీదికి తెస్తుందని, ఈ నేపథ్యంలో తనకు భయమేస్తోందంటూ అమెరికా చట్టసభ్యుల వద్ద మహమ్మద్ బిన్ సల్మాన్ ఆందోళన వ్యక్తం చేశారంటా. సౌదీ – ఇజ్రాయెల్ మధ్య సంబంధాలను సాధారణీకరించే ఒప్పందం చేసుకునే విషయంలో తన ప్రాణాలను పణంగా పెట్టినట్లు ఆయన వివరించారంటా. అయితే, పాలస్తీనాలో ఆందోళనలను పట్టించుకోకుండా ఇజ్రాయెల్ తో సంబంధాలను సాధారణీకరిస్తే తనను హత్య చేస్తారంటూ చెప్పుకొచ్చారంటా. అయినా కూడా తాను ఇజ్రాయెల్ తో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికే సిద్ధంగా ఉన్నట్లు తెలిపారంటా. ఇందులో భాగంగా అమెరికా సౌదీ అరేబియాతో రక్షణ ఒప్పందం, పౌర అణు కార్యక్రమం, టెక్నాలజీ రంగంలో పెట్టుబడులు వంటి జరిగాయంటూ పేర్కొన్నారంటా.


Also Read: హిందువుల భద్రతపై బంగ్లాదేశ్ సలహాదారు ప్రధాని మోదీకి ఫోన్‌కాల్‌

అయితే, ఈ సందర్భంగా మరో కీలక అంశాన్ని గుర్తు చేశారంటా. అదేమంటే.. ఇజ్రాయెల్ తో శాంతి ఒప్పందం కుదుర్చుకుని హత్యకు గురైన ఈజిప్టు నేత అన్వర్ సాదత్ పేరును కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారంటా. ఈ నేపథ్యంలో తన భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు అన్వర్ ను కాపాడేందుకు అమెరికా తీసుకున్న చర్యలపై ఆయన ఆరా తీసినట్లు అందులో పేర్కొన్నారు. శాంతి ఒప్పందాన్ని ఖరారు చేయడంతో తను ఎదర్కొనే బెదిరింపులు, గాజాలో యుద్ధం వల్ల ఇజ్రాయెల్ ను వ్యతిరేకిస్తున్న అరబ్ దేశాల్లో తనపై కోపాన్ని చల్లార్చేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న విషయాలపై ఆయన అమెరికా ప్రతినిధులతో చర్చించినట్లు అందులో పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. పది నెలలకు పైగా గాజాలో యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధం కారణంగా 39 వేలకు పైగా పౌరులు మృతిచెందారు. గాజాలోని పాఠశాలపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో 100 మందికి పైగా మృతిచెందారు. ఈ క్రమంలో తను తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారంటా. అయితే, ఓ యువరాజే ఈ విధంగా తనకు ప్రాణభయం ఉందంటూ వాపోవడంతో సౌదీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×