E-Paper
Advertisement

Devara Movie : ‘దేవర’ జోరుకు ఇండస్ట్రీ షేక్.. అక్కడ మాత్రం ఆల్ టైం రికార్డ్..

Devara Movie : ‘దేవర’ జోరుకు ఇండస్ట్రీ షేక్.. అక్కడ మాత్రం ఆల్ టైం రికార్డ్..
Advertisement

Devara Movie : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన దేవర సినిమా ఇవాళ థియేటర్లలో కి వచ్చేసింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. దేవర జాతర షురూ అయ్యిందని అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. గత రెండు వారాలుగా పెంచిన హైప్‌ కి ఏమాత్రం తగ్గకుండా ఉంది అనే టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే మిడ్ నైట్ షో లు, యూఎస్ ప్రీమియర్‌ షో లకు సంబంధించిన టాక్ వచ్చేసింది. సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. ఇక ఇక్కడ కూడా ఇలాంటి టాక్ నే అందుకుందని పబ్లిక్ రెస్పాన్స్ చూస్తే తెలుస్తుంది.. ఇక ఈ సినిమా ఆల్ టైం రికార్డ్ ను సొంతం చేసుకుంది.. ఇప్పటివరకు ఏ సినిమాకు లేని రికార్డ్ దేవర సొంతం అయ్యింది.

ఈ సినిమా రిలీజ్ కు ముందే అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకుంది. ప్రీ బుకింగ్స్ కూడా బాగానే జరిగాయి. ఎన్టీఆర్‌ దేవర సినిమా ను అత్యధిక థియేటర్‌ లలో విడుదల చేసిన నేపథ్యంలో మొదటి రోజు వసూళ్లు రికార్డ్‌ బ్రేక్ చేయడం కన్ఫర్మ్‌ అని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.. ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లోని మల్టీప్లెక్స్ లు అన్నింట్లోనూ నేడు దేవర తప్ప మరే సినిమా ఆడే పరిస్థితి లేదు. హైదరాబాద్‌ లోని ప్రసాద్స్‌ మల్టీప్లెక్స్ లో నేడు దేవర కి ఏకంగా 42 షో లు వేయబోతున్నారు. ఇప్పటి వరకు ప్రసాద్‌ మల్టీప్లెక్స్ లో ఒక రోజు ఒక సినిమాకి ఇన్ని షోలు పడిందే లేదు. ఈ అరుదైన రికార్డ్‌ ను దేవర సొంతం చేసుకుంది..

Advertisement

ఇది మామూలు విషయం కాదు.. ఆల్ టైం రికార్డ్.. ఎన్టీఆర్ లైఫ్ లో ఇప్పటివరకు అందుకొని రికార్డ్ అనే చెప్పాలి.. ప్రసాద్స్‌ మల్టీప్లెక్స్ లో మొదటి రోజు అత్యధిక వసూళ్లు సైతం నమోదు అవ్వబోతున్నాయి. కేవలం ప్రసాద్స్‌ మల్టీప్లెక్స్ లో అనే కాకుండా మొత్తం తెలుగు రాష్ట్రాల మల్టీప్లెక్స్ ల్లోనూ దేవర జోరు కనిపిస్తుంది.. ఒకే రోజు 42 షోలు అంటే చిన్న విషయమే కాదు. మొదటి రోజు కావడంతో ప్రతి మల్టీప్లెక్స్ ల్లోనూ హౌస్ ఫుల్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. అంటే మొదటి రోజే కలెక్షన్స్ భారీగానే రాబట్టే అవకాశాలు ఉన్నాయి. నిన్నటి వరకు 35 షో లకు అడ్వాన్స్‌ బుకింగ్‌ ద్వారా హౌస్‌ ఫుల్ అయిందట. సినిమాకు పాజిటివ్‌ టాక్ రావడంతో ఆ బ్యాలన్స్ టికెట్లు ఇప్పటికే బుక్ అయిపోయి ఉంటాయి. కేవలం మొదటి రోజు మాత్రమే కాకుండా వీకెండ్స్ అయిన శని, ఆది వారాల్లోనూ సినిమా కు ఇదే స్థాయిలో షో లు పడే అవకాశాలు ఉన్నాయి. దేవర జోరు చూస్తే రికార్డ్ స్థాయిలో వసూల్ రాబడుతుందని తెలుస్తుంది.. మొత్తానికి దేవర సినిమా రిజల్ట్ కొరటాలకు మళ్లీ కం బ్యాక్ ఇచ్చింది.. ఇక కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×