E-Paper
Advertisement

Devara : హద్దులు దాటిన అభిమానం… దేవర కోసం టోక్యో నుంచి లాస్ ఎంజిల్స్ కు వచ్చిన డై హార్డ్ ఫ్యాన్

Devara : హద్దులు దాటిన అభిమానం… దేవర కోసం టోక్యో నుంచి లాస్ ఎంజిల్స్ కు వచ్చిన డై హార్డ్ ఫ్యాన్
Advertisement

Devara : ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్న అతి కొద్ది మంది స్టార్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ద్వారా ఈ విషయం మరోసారి స్పష్టమైంది. మరి తారక్ ను చూడడానికి ఆ అభిమాని చేసిన పని ఏంటో తెలుసుకుందాం పదండి.

‘దేవర’ కోసం టోక్యో నుంచి లాస్ ఏంజెల్స్ కు…

Advertisement

అతి చిన్న వయసులోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో ఎన్టీఆర్. నిన్న మొన్నటిదాకా టాలీవుడ్ స్టార్ గా ఓ వెలుగు వెలిగిన ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బాలీవుడ్ స్థాయిని దాటి గ్లోబల్ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఒక్కసారిగా ఫ్యాన్ ఇండియా స్టార్ అయిన తారక్ కు ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. అందులో భాగంగానే తారక్ కు జపాన్ లో కూడా భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఇప్పటికే ఆయన హీరోగా నటించిన పలు సినిమాలు అక్కడ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలవగా, ఎన్టీఆర్ నటనకు ఫిదా అయినా అక్కడి ప్రజల్లో కొంతమంది ఆయనకు డై హార్డ్ ఫ్యాన్స్ గా మారారు. ముఖ్యంగా మన హీరోకి అక్కడ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా జపాన్ లో రిలీజ్ అయినప్పుడు కూడా ఎన్టీఆర్ ను కలవడానికి లేడీ ఫ్యాన్స్ భారీగానే తరలివచ్చారు.. అంతేకాదు ఆయనతో ఫోటోలు తీసుకుని తెగ మురిసిపోయారు. ఇక తాజాగా ఓ మహిళా అభిమాని ‘దేవర’ సినిమాను చూడడానికి పెద్ద సాహసమే చేసింది. దేవర’ కోసం టోక్యో నుంచి లాస్ ఏంజెల్స్ కు వెళ్ళింది.

తారక్ ప్రామిస్.. అభిమాని ఎమోషనల్ 

Advertisement

సెప్టెంబర్ 27న ‘దేవర’ మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయిన విషయం తెలిసిందే. లాస్ ఏంజిల్స్ లో  జరుగుతున్న బియాండ్ బెస్ట్ లో ప్రదర్శితమైన ఫస్ట్ ఇండియన్ సినిమాగా ‘దేవర’ కొత్త చరిత్రను సృష్టించింది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ అక్కడ మూవీని చూడడానికి వెళ్ళిన విషయం తెలిసిందే. అక్కడడే ‘దేవర’ మూవీని చూడడానికి జపాన్ కు చెందిన ఒక మహిళా అభిమాని ఏకంగా ఖండాలు దాటి రావడం విశేషం. బియాండ్ ఫెస్ట్ లో ఎన్టీఆర్ ను కలిసిన సదరు అభిమాని తను జపాన్ రాజధాని టోక్యో నుంచి లాస్ ఏంజిల్స్ వచ్చి సినిమాను వీక్షించినట్టుగా చెప్పి సంబరపడింది. తారక్ ఆమెతో స్పెషల్ గా ముచ్చటించగా, ఆయన్ను చూడగానే ఆ మహిళా అభిమాని మీ కోసం మేమంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. జపాన్ రండి అంటూ భావోద్వేగానికి గురైంది. దీంతో ఎన్టీఆర్ ఆమెకు ప్రామిస్ చేయడంతో ఉబ్బి తబ్బిపోయింది ఆ మహిళ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఆమె దేశాలు దాటి తన అభిమానాన్ని చాటుకున్న విధానాన్ని చూసి తారక్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×