BigTV English

Devara First Single Hype: ఓరి బాబో.. హైప్ తోనే పోయేలా ఉన్నాంరా.. ఇంత ఎలివేషనా..?

Devara First Single Hype: ఓరి బాబో.. హైప్ తోనే పోయేలా ఉన్నాంరా.. ఇంత ఎలివేషనా..?

NTR’s Devara Fear Song Creating Extreme Hype in Social Media: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పాట మొదలెట్టారు. అంటే దాదాపు రెండేళ్లు తమ హీరోను సిల్వర్ స్క్రీన్ మీద చూడకపోతే ఏ అభిమానికైనా అలాగే ఉంటుందిలెండి.. ఆ అభిమానమే ఇప్పుడు సోషల్ మీడియాలో బయటపెడుతున్నారు తారక్ ఫ్యాన్స్. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.


ఇప్పటికే దేవర నుంచి రిలీజైన పోస్టర్స్.. అభిమానులను ఏ రేంజ్ లో ఆకట్టుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక దసరా కానుకగా దేవర ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రేపు ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఆయన బర్త్ డే సర్ ప్రైజ్ గా నేడు దేవర మొదటి సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఆ సాంగ్ ప్రకటించినప్పటి నుంచి సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. హైప్ తోనే అభిమానులు పోయేలా ఉన్నారు.

ఒకపక్క దేవర మేకర్స్, ఇంకోపక్క లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి.. మరోపక్క నాగవంశీ.. ఇలా ఒకరితరువాత ఒకరు దేవర ఫియర్ సాంగ్ గురించి ఎలివేషన్స్ ఇస్తూ ఇస్తూ ఇంకా హైప్ పెంచుకుంటూ పోతున్నారు. అంతేనా 1 అవర్ టూ గో.. 2 అవర్స్ టూ గో అంటూ మేకర్స్ వరుస పోస్టర్స్ తో అభిమానులను పిచ్చెక్కిస్తున్నారు. ఈరోజు సాయంత్రం 7 గంటలకు ఈ సాంగ్ రిలీజ్ కానుంది. ఇంత హైప్ ఇచ్చాకా.. సాంగ్ అటుఇటు అయ్యింది అంటే అంతే సంగతులు.


Also Read: Happy Birthday Jr NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ స్టోరీ.. ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు

అసలే ఈ సాంగ్ పై అభిమానులు మంచి టార్గెట్ పెట్టుకున్నారు. అంటే.. ఈ మధ్య స్టార్ హీరోల మధ్య ఫ్యాన్స్ వార్ జరుగుతున్న విషయం తెల్సిందే. మా హీరో పోస్టర్ కు ఇన్ని వ్యూస్ వచ్చాయి.. మా హీరో సాంగ్ రికార్డులు సృష్టించింది అని.. ఇప్పటికే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సాంగ్.. పుష్ప 2 సాంగ్.. ఈ రికార్డుల మధ్యనే నలిగింది. ఇప్పుడు అందరి చూపు దేవర ఫియర్ సాంగ్ మీదనే ఉంది. అనిరుధ్ మ్యూజిక్.. కొరటాల టేకింగ్.. ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇలా ఊహించుకుంటూ పోతే చాలా ఎలివేషన్స్ ఉనాన్యి. మరి ఈ సాంగ్ అభిమానులు అనుకున్న టార్గెట్ ను రీచ్ అవుతుందో లేదో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×