Jr NTR Birthday Special Story: ఒక సినిమా హిట్ కావాలంటే ముఖ్యమైనది నటన. నవరసాలు పండించగలిగే స్థాయి ఉండాలి. ఎలాంటి సన్నివేశాన్ని అయినా.. పిప్పి పిండి చేసేలా ఉండాలి. శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత, శాంత వంటి రసాలలో ఏ ఒక్కటి మిస్ అయినా సినిమాను పెద్దగా చూడరు. ఇలా నవరసాలన్నింటినీ పండించే స్టార్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటాడు.
ఇచ్చిన ఏ పాత్రని అయినా.. అలవోకగా చేసేస్తాడు. ఆయన ముఖంలో కోపం ఓ ప్రళయం, నవ్వు ఓ సముద్రం, బాధ ఓ వర్షం. అందుకే ఆయనంటే యంగ్ యూత్‌కి చాలా ఇష్టం. టాలీవుడ్‌లో మోస్ట్ పాపులారిటి ఉన్న హీరోల్లో ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటాడు. ఆయన స్టెప్పు వేస్తే థియేటర్ దద్దరిల్లాల్సిందే. ఆయన స్పీడ్ అండ్ మాస్ డ్యాన్స్‌కే మాస్టర్లు అతలా కుతలం అవుతుంటారు.
యాక్టింగ్, డ్యాన్స్ ఇలా ప్రతి విషయంలోనూ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. ఇక ఇవాళ (మే 20)న ఎన్టీఆర్ తన 41వ బర్త్ డేని జరుపుకుంటున్నారు. ఇప్పుడు ఆయనకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. దిగ్గజ నటుడు, సార్వభౌముడు సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూ ఎన్టీఆర్ అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.
Also Read: ఏపీలోని ఆలయానికి ఎన్టీఆర్ భారీ విరాళం.. వీడియో వైరల్
1991లో ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమాతో బాలనటుడిగా తన సినీ రంగం ప్రవేశం చేశాడు. అలాగే రామాయణం సినిమాలో నటించిన మెప్పించాడు. ఇక 2001లో హీరోగా చేసే ఛాన్స్ వచ్చింది. ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఇక అప్పుడు స్టార్ట్ అయిన ఆయన హీరోయిజం గత రెండేళ్ల క్రితం ‘ఆర్ఆర్ఆర్’ వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు.. ఎన్నో అవార్డులు, ఎన్నో ప్రశంసలు. అయితే కొన్ని సార్లు వరుస ఫ్లాపులు పలకరించినా.. ఆ తర్వాత కంబ్యాక్ అయ్యాడు.
‘ఆర్ఆర్ఆర్’తో నేషనల్ హీరోగా ఉన్న ఎన్టీఆర్ ఒక్కసారిగా గ్లోబల్ స్థాయి హీరోగా మారిపోయాడు. ఈ మూవీలో ఆయన నటనకు ఫిదా అవ్వని వారుండరు. సినీ ప్రముఖులే కాకుండా ఇతర దేశ ప్రధానులు సైతం ఎన్టీఆర్ నటనకు జై కొట్టారు. ఇక ఎన్టీఆర్ తన కెరీర్‌లో ఇప్పటి వరకు 29 సినిమాలు చేశాడు. ఇప్పుడు తన కెరీర్‌లో 30వ సినిమాగా ‘దేవర’ తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే ఈరోజు ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో ఆయన నటించిన పలు సినిమాలు ఓటీటీలో సందడి చేయడానికి సిద్దంగా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం..
Also Read: Srikanth: రేవ్ పార్టీలో హీరో శ్రీకాంత్.. క్లారిటీ వచ్చేసింది