E-Paper
Advertisement

Devara Collections: ‘కల్కి’ రికార్డ్ బ్రేక్.. ప్రభాస్ కంటే బెస్ట్ హీరో అని చెప్పడానికి ఈ లెక్క చాలదా.?

Devara Collections: ‘కల్కి’ రికార్డ్ బ్రేక్.. ప్రభాస్ కంటే బెస్ట్ హీరో అని చెప్పడానికి ఈ లెక్క చాలదా.?
Advertisement

Devara Collections: ప్రస్తుతం టాలీవుడ్‌లో బెస్ట్ హీరో ఎవరు అనే చర్చ ప్రేక్షకుల్లో తరచుగా సాగుతూనే ఉంటుంది. మా హీరో గ్రేట్ అంటే మా హీరో గ్రేట్ అంటూ ఫ్యాన్స్ మధ్య వార్ కూడా నడుస్తుంది. ఎప్పటికప్పుడు ఒక హీరో సినిమా కలెక్షన్స్‌ను బీట్ చేసేలా మరో హీరో సినిమా రంగంలోకి దిగడం.. ఆల్రెడీ క్రియేట్ అయిన రికార్డులను బ్రేక్ చేసి కొత్త రికార్డులు క్రియేట్ చేయడం.. ఇదంతా కామన్. ఎన్‌టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ విషయంలో కూడా అదే జరిగింది. ప్రస్తుతం ప్రభాస్‌కు ప్యాన్ ఇండియా స్టార్ అని, తెలుగులో టాప్ హీరో అని ట్యాగ్స్ ఉన్నాయి. కానీ తను చివరిగా నటించిన రెండు సినిమాల మొదటిరోజు కలెక్షన్స్‌ను ‘దేవర’ దాటేసింది.

దేవర దాటేశాడు

Advertisement

‘బాహుబలి’తో ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు ప్రభాస్. దీంతో మిగతా తెలుగు హీరోలకంటే అత్యధిక మార్కెట్‌ను సంపాదించుకున్న మొదటి హీరోగా ప్రభాస్ నిలిచాడు. అప్పటినుండి ఫ్యాన్స్ అంతా టాలీవుడ్‌లో ప్రభాసే నెంబర్ 1 అని ఫిక్స్ అయిపోయారు కూడా. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలు ఫ్లాప్ అయినా కూడా కలెక్షన్స్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇక రెండు సినిమాల ఫ్లాప్ తర్వాత ‘సలార్’తో మళ్లీ ఫార్మ్‌లోకి వచ్చాడు ప్రభాస్. ఆ మూవీ మొదటిరోజే రూ. 75.98 కలెక్షన్స్‌ను దాటేసింది. ఆ తర్వాత విడుదలయిన ‘కల్కి 2898 ఏడీ’ రూ.77.65 ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడు ఈ రెండిటి రికార్డులను ‘దేవర’ బీట్ చేసింది.

Also Read: నాన్ SSR రికార్డ్స్ బ్రేక్.. అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా ఆ స్థానం..!

Advertisement

మిక్స్‌డ్ టాక్

ఎన్‌టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘దేవర’ సినిమా మొదటిరోజే రూ.87.45 కోట్ల కలెక్షన్స్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంటే ప్రభాన్ నటించిన చివరి రెండు సినిమాలకంటే ‘దేవర’ ఓపెనింగ్ కలెక్షన్సే ఎక్కువ. అంటే ప్రభాన్‌ను మించిన మార్కెట్ ఎన్‌టీఆర్‌కు ఉంది అంటూ అభిమానులు ఫిక్స్ అయిపోయారు. దీన్ని బట్టి చూస్తే టాలీవుడ్ టాప్ హీరో కూడా ఎన్‌టీఆర్ అని అనుకుంటున్నారు. ‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలు విడుదలయిన మొదటిరోజే పాజిటివ్ టాక్ అందుకున్నాయి. కానీ ‘దేవర’కు మాత్రం మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినా ఆ రెండు సినిమాల కంటే ‘దేవర’కు వచ్చిన కలెక్షన్సే ఎక్కువ.

స్కోప్ లేదు

‘దేవర’.. ఇలాగే ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తూ ముందుకెళ్తే కలెక్షన్స్ విషయంలో మరెన్నో రికార్డులు బ్రేక్ చేయడం ఖాయమని ఇండస్ట్రీ నిపుణులు అంటున్నారు. సెప్టెంబర్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ సెప్టెంబర్ 26 అర్థరాత్రి 1 నుండే ఫ్యాన్ షోలు మొదలయ్యాయి. ఫ్యాన్స్ అంతా సినిమా చూసిన తర్వాత పాజిటివ్ టాక్ అందించారు. కొందరు ప్రేక్షకులు మాత్రం పార్ట్ 1 బాగానే ఉన్నా.. పార్ట్ 2కు అసలు స్కోప్ లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు కూడా. అయినా మరీ నెగిటివ్ టాక్ కూడా రాకపోవడంతో కలెక్షన్స్ విషయంలో రికార్డులు బద్దలుగొట్టే ఛాన్స్ ‘దేవర’కు ఉంది. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ చాలా ప్లస్ అయ్యింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×