Big Stories

Devara Movie 2nd Single: రొమాంటిక్ సీన్స్‌లో ‘దేవర’.. సెకండ్ సింగిల్ ఇదేనా..!

NTR’s Devara Movie Second Single: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దేవర’. బిగ్గెస్ట్ యాక్షన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను దర్శకుడు రెండు పార్ట్స్‌గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపించనున్నారు. తాజాగా, ఈ సినిమా అప్డేట్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతుండగా.. ప్రస్తుతం బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, ఎన్టీఆర్‌ల మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. గోవాలోనే మరికొన్ని రోజులు షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది.

- Advertisement -

Also Read? కత్రినా కైఫ్ ఫొటోలు వైరల్.. ఆమె గర్భవతి కాదంటా..?

- Advertisement -

త్వరలోనే సెకండ్ సింగిల్..

ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఇటీవల మేకర్స్ ‘దేవర’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ఫియర్ సాంగ్‌గా ఈ వచ్చిన ఈ సాంగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఈ సాంగ్‌కు మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ కానుందని, గోవాలో జరిగే ఈ రొమాంటిక్ నంబర్‌గా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. కాగా, ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. అయితే క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్ ఉంటుందని సమాచారం. ఇదే సెకండ్ పార్ట్‌కు ఇంట్రో అని సినిమా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News