OTT Movie : థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకున్న ఒక లో బడ్జెట్ సినిమా, ఓటీటీలో ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ కి వచ్చింది. IMDbలో 9.6/10 రేటింగ్ తో దూసుకుపోతోంది. దీని ప్రత్యేకమైన కాన్సెప్ట్, ఫాంటసీ రియలిజం, పవర్ ఫుల్ యాక్టింగ్ రోల్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. ఇది ఒక రచయిత ఊహాజనిత పాత్రలు నిజ జీవితంలో కనిపించి, అతన్ని న్యాయం కోసం డిమాండ్ చేసే అద్భుతమైన కథను అందిస్తుంది. ఈ సినిమా మొదటి నుండి చివరి వరకు ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? ఈ స్టోరీ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే
‘మాయకూతు’ (Maayakoothu) ఎ.ఆర్. రాఘవేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ క్రైమ్ ఫాంటసీ చిత్రం. నాగరాజన్ కన్నన్, ఢిల్లీ గణేష్, ము రామస్వామి, సాయి ధీనా, ఎస్.కె. గాయత్రి, ఐశ్వర్య రఘుపతి ప్రధాన పాత్రల్లో నటించారు. రాహుల్ మూవీ మేకర్స్, అభిమన్యు క్రియేషన్స్ బ్యానర్‌ల కింద రాహుల్ దేవ, ప్రసాద్ రామచంద్రన్ దీనిని నిర్మించారు. ఈసినిమా 2025 ఆగస్ట్ 27నుంచి Zee 5, Sun NXT లో తమిళం, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది.
స్టోరీలోకి వెళ్తే
వాసన్ ఒక రచయిత. ఒక చిన్న మ్యాగజైన్‌లో వీక్లీ కాలమ్‌లు రాస్తుంటాడు. అతను తన కథల్లోని పాత్రలను దేవుడిలా భావిస్తాడు. కానీ అతని కథలు చాలా వరకు ట్రాజెడీతో ఉంటాయి. అతని కథల్లో మూడు పాత్రలు ప్రధానమైనవి. సెల్వి అనే ఒక పనిమనిషి, 2000 రూపాయలు దొంగిలించిందని ఆరోపణలు ఎదుర్కొంటూ, తన కొడుకు స్కూల్ ఫీజుల కోసం ఇబ్బందులు పడుతుంటుంది. ధనపాల్ అనే ఒక గ్యాంగ్‌స్టర్, 49హత్యలు చేసి 50వ హత్యకు కూడా సిద్ధపడుతుంటాడు. రాజి అనే ఒక గ్రామీణ అమ్మాయి, డాక్టర్ కావాలని కలలు కంటూ, డబ్బులు లేక NEET రాయలేక సతమతమవుతుంటుంది.
వాసన్ ఈ పాత్రలకు ఒక ట్రాజెడీ క్లైమాక్స్ ని ఇస్తాడు. ఎందుకంటే అతను ప్రపంచం అంతా నీచమైనదని నమ్ముతుంటాడు. కానీ ఒక రోజు, కథలో ఉన్న ఈ పాత్రలు నిజంగా అతని ఇంటి తలుపు తట్టి, “మమ్మల్ని ఎందుకు ఇంత బాధల్లో ముంచావు? మాకు న్యాయం చేయి!” అని డిమాండ్ చేస్తాయి. ఇక్కడ నుండి కథ సర్రియల్ టర్న్ తీసుకుంటుంది. వాసన్ తన సొంత కథల్లో చిక్కుకుని, ఈ పాత్రలు పడుతున్న బాధలను దగ్గరనుంచి చూస్తాడు. సెల్వి అతన్ని విషం కలిపిన పాలు తాగమని బలవంతం చేస్తుంది. ఆమె నుండి తప్పించుకుని హాస్పిటల్‌లో కళ్లు తెరిచే సరికి, అక్కడ రాజి నర్సుగా కనిపిస్తుంది. ఆమె కలలను వాసన్ రాసిన కథలో చంపేశాడు. ఆ తర్వాత ధనపాల్ అతన్ని తన 50వ హత్య కోసం టార్గెట్ చేస్తాడు.
వాసన్ రాసిన మరో పాత్రలో, ఒక ఆటో డ్రైవర్ అతన్ని తీసుకెళ్లి, సమాజం గురించి ఒక శక్తివంతమైన సందేశాన్ని ఇస్తాడు. వాసన్ తాను రాసిన పాత్రల బాధలను చూస్తూ, తనపై ప్రశ్నలు వేసుకోవడం మొదలుపెడతాడు. అతని భార్య ఇందు అతని రచనలను సరదాగా ఎగతాళి చేస్తూ, అతన్ని రియాలిటీలోకి తీసుకొస్తుంది. చివరగా వాసన్ తన పాత్రల కథలను రీరైట్ చేసి, వారికి సంతోషకరమైన ముగింపులు ఇవ్వాలనుకుంటాడు. వాసన్ ఈ పాత్రలకు ఎలాంటి ముగింపు ఇస్తాడు ? అతనిలో మార్పు తీసుకొచ్చిన సన్నివేశాలు ఏమిటి ? ఈ పాత్రల వల్ల వాసన్ ఎలాంటి ఇబ్బందులు పడతాడు ? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే, ఈ తమిళ క్రైమ్ ఫాంటసీ సినిమాను తప్పకుండా చుడండి.
Read Also : స్టార్ హీరోయిన్ తో పాడు పనులకు ప్లాన్… సెన్సారోళ్లే నోరెళ్ళబెట్టిన సినిమా… ఇంకా చూడలేదా మావా?