Jayammu Nischayammu raa: జగపతిబాబు (Jagapathi Babu)హోస్ట్ గా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా(Jayammu Nischayammu Raa) టాక్ షో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సెలబ్రిటీలు హాజరవుతూ వారికి సంబంధించిన సినీ విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాల గురించి కూడా జగపతిబాబు ఎన్నో ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబడుతున్నారు. ఇక ఈ కార్యక్రమం ఇప్పటికే రెండు ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. మొదటి ఎపిసోడ్ లో నాగార్జున ఈ కార్యక్రమంలో సందడి చేయగా రెండవ ఎపిసోడ్ లో శ్రీ లీల సందడి చేశారు.
దెబ్బలు బాగా తినేవాణ్ణి…
ఇక మూడవ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలను విడుదల చేస్తున్నారు అయితే ఈ మూడవ ఎపిసోడ్లో భాగంగా నాచురల్ స్టార్ నాని(Nani) ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో వీడియో విడుదల చేశారు. ఇక ఈ వీడియోలో భాగంగా నాని స్కూల్లో చదువుతున్న విశేషాలు గురించి జగపతిబాబు ప్రశ్నలు వేశారు. స్కూల్లో తాను అందరితోపాటు బాగానే దెబ్బలు తిన్నానని తెలిపారు. అదేవిధంగా తన గురించి పర్సనల్ కేర్ తీసుకునే ఒక టీచర్ ఉండేదని తన టీచర్ గురించి కూడా ఈ సందర్భంగా తెలియజేశారు.
తనపై పర్సనల్ కేర్ ఉండేది..
స్కూల్లో చదువుతున్న సమయంలో ఏదైనా ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే కచ్చితంగా మా అమ్మకు సుందరమ్మ టీచర్ నుంచి ఫోన్ వచ్చేదని తెలిపారు. రేపు ఈ ఎగ్జామ్ ఉంది నాని చదువుతున్నాడా లేదా అంటూ తన గురించి పర్సనల్ కేర్ తీసుకొని మా అమ్మతో ఎప్పుడు ఫోన్లో మాట్లాడేదని నాని తన టీచర్ గురించి తెలియజేయడంతో వెంటనే జగపతిబాబు మీ టీచర్ కి సంబంధించిన ఒక ఏవీ చూద్దామని చెప్పారు. నాని ఏవీ కోసం ఎదురు చూస్తుండగా వెనకనే తన టీచర్ రావడంతో అదిగో అక్కడ ఉంది ఏవీ అంటూ ఆమెను చూపిస్తారు జగపతిబాబు. ఒక్కసారిగా తన టీచర్ తన కళ్ళు ముందు ఉండడంతో నాని ఎంతో సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా అసలు నమ్మలేకపోతున్నానని తెలిపారు.
టీచర్ కాళ్లకు నమస్కరించి నాని ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక జగపతిబాబు నాని టీచర్ ను ప్రశ్నిస్తూ స్కూల్లో నాని ఎలా ఉండేవారని అడగగా చాలా చక్కగా నిద్రపోయేవాడు అంటూ నాని గురించి సంచలన విషయాలను బయటపెట్టారు. అంతేకాకుండా నాని కోసం టీచర్ ఒక స్పెషల్ గిఫ్ట్ కూడా తీసుకు వచ్చారు. అయితే ఆ గిఫ్ట్ ఏంటో మాత్రం చూపించలేదు. మొత్తానికి ఈ ప్రోమో ఎంతో అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా నాని, జగపతిబాబు మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ఇక ఈ కార్యక్రమం పూర్తి ఎపిసోడ్ ఆదివారం రాత్రి 9 గంటలకు జీ తెలుగులో ప్రసారమవుతుంది. ఇక నాని సినీ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం నాని శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో ది ప్యారడైజ్(The Paradise) సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా 2026 మార్చి 26వ తేదీ ఏకంగా 8 భాషలలో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.
Also Read: OG Suvvi Suvvi Song: ఏంటీ ఓజీ సువ్వి సువ్వి సాంగ్ కూడా కాపీనా..ఇలా దొరికిపోయావ్ ఏంటీ తమన్!