BigTV English

SU From SO: అప్పుడే ఓటీటీకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హారర్, కామెడీ ‘సు ఫ్రమ్ సో‘.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే

SU From SO: అప్పుడే ఓటీటీకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హారర్, కామెడీ ‘సు ఫ్రమ్ సో‘.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే

Su From So OTT Release: ఈ మధ్య చిన్న సినిమాలు సైతం భారీ హిట్స్ అందుకుంటున్నాయి. భారీ బడ్జెట్, స్టార్ హీరోల సినిమాలు డీలా పడుతున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండ వచ్చి ఊహించని రెస్పాన్స్ అందుకుంటున్నాయి. స్టార్ కాస్ట్ లేకపోయిన బాక్సాఫీసు వద్ద వందల కోట్లు వసూళ్లు చేస్తున్నాయి. అలా ఇటీవల చిన్న సినిమాగా వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మూవీ ‘సు ఫ్రమ్ సో’. కన్నడ భాషలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 25న విడుదలై సూపర్ హిట్ కొట్టింది. పెద్ద స్టార్ కాస్ట్ లేదు, పెద్ద డైరెక్టర్ కాదు. కానీ, రికార్డు కలెక్షన్స్ తో బాక్సాఫీసును షేక్ చేసింది.


వందకోట్ల క్లబ్ లో చేరిన మూవీ

చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ.120 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. ఈ సినిమా భారీ రెస్పాన్స్ రావడంతో తెలుగులోనూ రిలీజైంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. భారీ అంచనాల మధ్య ఆగస్టు 8న రిలీజైంది. కానీ, ఇక్కడ ఈ సినిమా ఆశించిన స్థాయిలో పెద్దగా రెస్పాన్స్ రాలేదు. కన్నడ, తెలుగులో థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కి రెడీ అవుతుంది. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో సు ఫ్రమ్ సో డిజిటల్ ప్రీమియర్ కు రానుంది. ఈ మూవీ రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ జీయో హాట్ స్టార్ తీసుకుంది.


అప్పుడే ఓటీటీలోకి..

దీంతో సు ఫ్రమ్ సోని సెప్టెంబర్ 5న ఓటీటీలో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఇప్పటి వరకు అధికారిక సమచారం లేదు. అయితే ఈ సినిమ థియేట్రికల్ రన్ పూర్తి అయిన తర్వాతే ఓటీటీ రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. సు ఫ్రమ్ సో కన్నడలో థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 5న మూవీని ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. కన్నడతో పాటు తెలుగు, తమిళ్, మలయాళి భాషల్లోనూ అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. కాగా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన జేపీ తుమినాడ్.. ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

Also Read: Actor Rajesh:లైవ్ ఈవెంట్ లో కుప్పకూలిన నటుడు.. పరిస్థితి విషమం!

ఈ చిత్రానికి ఆయనే కథ రాయడం విశేషం. సు ఫ్రమ్ సోకి ప్రముఖ కన్నడ హీరో, దర్శకుడు రాజ్ బి శెట్టి సహా నిర్మాతగా వ్యవహరించారు.హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఇతర భాషల్లోనూ రిలీజ్ చేశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో హారర్ కామెడీ చిత్రంగా సు ఫ్రమ్ సో తెరకెక్కింది. తీర ప్రాంతంలో ఉండే ఓ ఊరిలో అశోక్ అనే కుర్రాడు ఆవారాగా తీరుగుతుంటాడు. అతడిని సులోచన అనే దెయ్యం ఆవహించిందనే పుకారు ఉరంతట వ్యాపిస్తుంది. ఆ తర్వాత ఊరిలో కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయి. వీటన్నింటికి కారమేంటి? అసలు ఆ సులోచన దెయ్యం ఎవర? చివరకు ఏమైందనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

OTT Movie : భర్తనే ప్రైవేట్ వీడియోలతో బ్లాక్ మెయిల్… కట్టుకున్నోన్ని వదిలేసి ఆటగాడితో… వాడిచ్చే ట్విస్టుకు ఫ్యూజులు అవుట్

OTT Movie : ఆరుగురు అమ్మాయిల అడ్వంచర్… కేవ్ లో కేక పెట్టించే హర్రర్ సీన్స్… సీట్ ఎడ్జ్ థ్రిల్లర్

OTT Movie : బాబోయ్… ఏకంగా 236 మిలియన్ వ్యూస్… ఓటీటీలో గత్తర లేపుతున్న సినిమా

OTT Movie : ఐఎండీబీలో 9.6 రేటింగ్… వరుసగా 49 మర్దర్లు… మతిపోగోట్టే తమిళ ఫ్యాంటసీ క్రైమ్ థ్రిల్లర్

Maaman OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసిన మామన్.. ఎక్కడంటే?

Big Stories

×