BigTV English

Rajasthan Woman: 17వ బిడ్డకు జన్మనిచ్చిన 55 ఏళ్ల మహిళ.. ఇప్పటికైనా యుద్ధం ఆపుతారా?

Rajasthan Woman: 17వ బిడ్డకు జన్మనిచ్చిన 55 ఏళ్ల మహిళ.. ఇప్పటికైనా యుద్ధం ఆపుతారా?

Rajasthan Shocker:  ప్రపంచం రోజు రోజుకు శరవేగంగా ముందుకెళ్తున్నా, కొంత మంది ఇంకా పాతకాలంలోనే బతుకుతున్నట్లు ఫీలవుతున్నారు. ఓవైపు ఒకరిద్దరు పిల్లలు కనేందుకు కొంత మంది నానా ఇబ్బందులు పడుతుంటే, మరికొంత మంది డజన్ల కొద్దీ పిల్లల్ని కనేస్తున్నారు. తాజాగా రాజస్థాన్ లో ఓ మహిళ 55 ఏళ్ల వయసులో ఏకంగా 17వ బిడ్డకు జన్మనిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది ఉదయ్‌ పూర్‌ కు చెందిన 55 ఏళ్ల రేఖా గల్బేలియా మంగళవారం నాడు ఇంకో బిడ్డకు జన్మనిచ్చింది. తనకు నాలుగో సంతానం అని అబద్దం చెప్పి హాస్పిటల్లో జాయిన్ అయినట్లు అక్కడి సిబ్బంది వెల్లడించారు.


ఇప్పటికే 16 మంది పిల్లలకు జన్మనిచ్చిన రేఖ

రేఖకు ఇప్పటికే 16 మంది పిల్లలకు జన్మనిచ్చింది. వారిలో నలుగురు కుమారులు, ఒక కుమార్తె పుట్టిన కొద్ది నెలల్లోనే చనిపోయారు. ప్రస్తుతం జీవించి ఉన్న పిల్లల్లో ఐదుగురికి పెళ్లి అయ్యింది. వారికి పిల్లలు కూడా అయ్యారు. ఈ వయసులో ఆమె మరో బిడ్డకు జన్మనివ్వడం పట్ల అందరూ ఆశ్చర్యపోతున్నారు.


ఓవైపు పేదరికం ఇబ్బంది పెడుతున్నా..

అటు ఈ ఘటనపై రేఖ కుమార్తె షీలా కీలక విషయాలు వెల్లడించారు. తాము చిన్నప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు పడినట్లు వెల్లడించింది. తన తల్లి ఇంత మంది పిల్లలు అని తెలి చాలా మంది ఆశ్చర్యపోతున్నట్లు చెప్పుకొచ్చింది. రేఖ కుటుంబం ఇప్పటికీ కటిక పేదరికంలో ఉంది. పాత ఇనుప సామాన్లు అమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ సొంతంగా పక్కా ఇల్లు లేదు. కేవలం రేకుల ఇంట్లోనే నివాసం ఉంటున్నారు.  పిల్లలను సాదడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. పిల్లలకు తిండి పెట్టడానికి వడ్డీకి అప్పులు తెలుచ్చిన సందర్భాలున్నాయన్నారు రేఖ భర్త కవ్రా కల్బేలియా. ఇప్పటికీ తెచ్చిన డబ్బులకు వడ్డీలు కడుతున్నట్లు వివరించాడు. పేదలకు ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసినా, భూమి తమ పేరు మీద లేకపోవడంతో ఇల్లు కట్టుకునేందుకు అనుమతి రాలేదన్నారు. తిండికి, పెళ్లిళ్లకు, చదువులకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పుకొచ్చాడు.

Read Also: డిమార్ట్ లో ఈ మహిళల్లా అస్సలు చేయకండి, లేదంటే బుక్కవ్వడం పక్కా!

తప్పుడు సమాచారం ఇచ్చి ఆస్పత్రిలో చేరిక

అటు రేఖ హాస్పిటల్లో చేరినప్పుడు కుటుంబ సభ్యులు వైద్యులకు తప్పుడు వివరాలు అందించినట్లు హాస్పిటల్ సిబ్బంది వివరించారు. ఆమెకు నాలుగో కాన్పు అని చెప్పి అక్కడ జాయిన్ చేసినట్లు  ఝాడోల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గైనకాలజిస్ట్ రోషన్ దరంగి తెలిపారు. కానీ, ఆ తర్వాత 17వ బిడ్డకు జన్మనిచ్చిందని తెలిసి ఆశ్చర్యపోయామన్నారు. పేదరికంలో మగ్గుతున్నా పిల్లల్ని కనడం ఏంటిని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: ఒక్క రోజు రెస్టారెంట్ బిల్లు కోటి రూపాయలా? బంగారం ఏమైనా తిన్నార్రా బాబూ?

Related News

Monkey incident: చెట్టెక్కిన కోతి.. కింద కురిసిన నోట్ల వర్షం.. ఎంత అదృష్టమో!

Viral Video: ఇంటర్వ్యూలో అడ్డంగా బుక్కైన తెలుగు అమ్మాయి!

Viral News: ఆ చికెన్ మీద మనసు పడ్డ బ్లాక్ పింక్ లిసా, వరల్డ్ వైడ్ గా వైరల్ అంతే!

Viral News: ఒక్క రోజు రెస్టారెంట్ బిల్లు కోటి రూపాయలా? బంగారం ఏమైనా తిన్నార్రా బాబూ?

DMart: డిమార్ట్ లో ఈ మహిళల్లా అస్సలు చేయకండి, లేదంటే బుక్కవ్వడం పక్కా!

Big Stories

×