BigTV English

French Open Champions Alcaraz: ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్ వారసుడు, అల్కరాస్ విజేత..!

French Open Champions Alcaraz: ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్ వారసుడు, అల్కరాస్ విజేత..!

French Open champions Alcaraz: ఫ్రెంచ్ ఓపెన్‌లో కొత్త ఛాంపియన్ వచ్చాడు. అదీ కూడా స్పెయిన్ వ్యక్తి కావడంతో అభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండా పోతోంది. నాదల్ బాటలోనే నడుస్తూ అల్కరాస్ మట్టి కోర్టులో తొలిసారి జెండా ఎగురవేశాడు.


ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో స్పెయిన్‌కి చెందిన అల్కరాస్.. జర్మనీకి చెందిన జ్వెరెవ్‌పై అద్భుతమైన విజయం సాధించాడు. దాదాపు నాలుగు గంటలపాటు జరిగిన మ్యాచ్‌లో ఇరువురు ఆటగాళ్లు హోరాహోరీగా తలపడ్డారు. తొలి మూడు సెట్లకు దాదాపు మూడు గంటలపాటు సమయం పట్టిందంటే పోరు ఏ జరిగిందో సాగిందో అర్థం చేసుకోవచ్చు.

తొలి సెట్‌లో పైచేయి సాధించిన అల్కరాస్, రెండో సెట్‌లో మాత్రం ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైంది. దీంతో మూడో మ్యాచ్లో ఇరువురు ఆటగాళ్లు కొదమ సింహాల్లా తలపడ్డారు. జ్వెరెవ్ ముందు అల్కరాస్ తలవంచాడు. పరిస్థితి గమనించిన జకోవిచ్ తరహాలో ఆడి నాలుగు, ఐదో సెట్లను గెలుచుకున్నాడు. నాలుగో సీడ్ ఆటగాడు జ్వెరెవ్‌ని ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.


Also Read: నరాలు తెగే ఉత్కంఠ పోరులో పాక్‌ను చిత్తు చేసిన భారత్

టైటిల్ గెలిచే క్రమంలో స్పెయిల్ యంగ్ బుల్ మూడు ఏస్‌లతోపాటు 52 విన్నర్లు కొట్టాడు. మాజీ ఛాంపియన్ 19 ఏళ్లలో రఫెల్ నాదల్ మట్టి కోర్టులో విజేతగా నిలిస్తే.. 21 ఏళ్లలో అల్కరాస్ ఆ ఘనత సాధించిన రెండో ఆటగాడు. ఇక అల్కరాస్ కెరీర్‌లో ఇది మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్.

అంతకుముందు 2022లో యూఎస్ ఓపెన్, గతేడాది వింబుల్డన్ విజేతగా నిలిచాడు అల్కరాస్. గడిచిన పదేళ్లు పరిశీలిస్తే.. నాదల్, జకోవిచ్, వావ్రింకా లేకుండా ఫ్రెంచ్ ఓపెన్‌లో టైటిల్ అందుకున్నదీ అల్కరాస్. అంతేకాదు మట్టి కోర్టులో విజయం సాధించిన స్పెయిన్‌కి చెందిన ఏడో వ్యక్తి కూడా. ఇకపై టీనేజర్ శకం మొదలైందని అంటున్నారు టెన్నిస్ లవర్స్.

Tags

Related News

Virender Sehwag: డైపర్ వేసుకొని సచిన్ సెంచరీ కొట్టాడు.. సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్

Watch Video : ఇదెక్కడి క్రికెట్ రా.. ఇలా ఆడితే అస్సలు రన్ అవుట్ కాబోరు

Sanju Samson : సంజూ అరాచకం.. వరుసగా 6,6,6,6,6,6

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Big Stories

×