E-Paper
Advertisement

Devara OTT : ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లీక్… నెట్‌ఫ్లిక్స్‌తో అగ్రిమెంట్ ఎలా జరిగిందంటే..?

Devara OTT : ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లీక్… నెట్‌ఫ్లిక్స్‌తో అగ్రిమెంట్ ఎలా జరిగిందంటే..?
Advertisement

Devara OTT : యావత్ సినీ ప్రేక్షకులు కల్కి తర్వాత దేవర కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు సినిమాను థియేటర్లలో చూద్దామా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా రేపు రాత్రికి ప్రీమియర్ షోలు పడిపోతాయి. ఇక 27 న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల కాబోతుంది. మరో రెండు రోజుల్లో సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో దేవర బిజినెస్ డిటైల్స్ ఒక్కొక్కటి బయటపడుతుంది.. ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ హక్కుల గురించి మరోవార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

దేవర ఓటీటీ డేట్ లీక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Advertisement

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో భారీ బడ్జెట్ చిత్రంగా వస్తున్న సినిమా దేవర.. త్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ హీరోగా వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ మూవీ భారీగా బిజినెస్ చేసింది. ఇప్పుడు తాజాగా ఓటీటీ డేట్ గురించి నెట్టింట వార్తలు ఊపందుకున్నాయి.. దేవర మేకర్స్ – నెట్‌ఫ్లిక్స్ మధ్య జరిగిన ఒప్పందం లీక్ అయింది. ఈ ఒప్పందం ప్రకారం దేవర మూవీని థియేటర్‌లో రిలీజ్ అయిన తర్వాత 50 రోజులు అయ్యాకే ఓటీటీలో స్ట్రీమింగ్ చెయ్యాలనే యోచనలో ఉన్నారు మేకర్స్. అంటే ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ రెండో వారం లేదా మూడో వారం నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇకపోతే దేవర మూవీ ఓటీటీ రైట్స్‌ని నెట్‌ఫ్లిక్స్ 155 కోట్లకు తీసుకున్నారని టాక్.. మరి ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే అధికారక ప్రకటన వచ్చేవరకు వెయిట్ చెయ్యాల్సిందే..

Devara OTT Date Leaked.. When is the streaming?
Devara OTT Date Leaked.. When is the streaming?

దేవర బిజినెస్ డీటెయిల్స్..

Advertisement

ఆచార్య ఫ్లాప్‌ తర్వాత ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో ఉన్న కొరటాల శివ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. భారీ బడ్జెట్‌ తో తెరకెక్కిన ఈ సినిమా ను సెప్టెంబర్‌ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.. సినిమా పై ఉన్న అంచనాలకు తగ్గట్లే ఈ సినిమా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ ఓ రేంజ్‌ లో సాగుతోంది. ఓవర్‌సీస్‌లో చాలా రోజుల క్రితమే అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఓపెన్‌ కాగా దేవర సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. అమెరికాలో బిగ్గెస్ట్ రికార్డ్స్‌ బుకింగ్స్, బెనిఫిట్ షోల తో రికార్డును సృష్టించిన దేవర చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మంచి బిజినెస్ ను అందుకుందని తెలుస్తుంది.. ఇక ఇప్పటికే రూ. 450 కోట్ల వరకు రాబట్టిందని వార్తలు వినిపిస్తున్నాయి.. మొత్తంగా చూసుకుంటే 500 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా రిలీజ్ కు ముందే రికార్డ్ క్రియేట్ చేసింది. మరి రిలీజ్ అయ్యాక ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో మరో రెండు రోజుల్లో తెలియనుంది..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×