BigTV English

KTR: మూసీ పేరుతో భారీ కుంభకోణానికి కుట్ర.. రూ.లక్షన్నర కోట్లా!

KTR: మూసీ పేరుతో భారీ కుంభకోణానికి కుట్ర.. రూ.లక్షన్నర కోట్లా!

KTR Key Statements about Musi River Development: మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ కుంభకోణం చేసేందుకు తెర లేపిందని  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఫతేనగర్, కూకట్‌పల్లిలోని మురుగు నీటి శుద్ధి కేంద్రాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. మూసీ ప్రాజెక్టుకు రూ.లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టే అవసరం ఉందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇక, మూసీ టెండర్లను పాకిస్తాన్ కంపెనీలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు.


ఫతేనగర్ ఎస్టీపీల్లో(మురుగు శుద్ధి కేంద్రం) శుద్ధి చేసిన నీరంతా మూసీ నదిలోకి వెళ్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. దాదాపు 94శాతం స్వచ్ఛమైన నీరు మూసీలోకి వెళ్తున్నపుడు మళ్లీ మూసీ శుద్ధి ఎందుకని కేటీఆర్ నిలదీశారు.

మురుగు శుద్ధి కేంద్రాల నిర్మాణాలపై కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పెండింగ్ పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. అనంతరం కూకట్‌పల్లి ఎస్టీపీని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.వేల కోట్ల కుంభకోణానికి తెర లేపిందన్నారు.


హైదరాబాద్‌ను మురుగు నీటి రహిత నగరంగా మార్చాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్టీపీలను ప్రారంభించినట్లు కేటీఆర్ గుర్తు చేశారు. ఇందులో భాగంగానే రూ.3,866 కోట్లతో 31 ఎస్టీపీల నిర్మాణాలను చేపట్టినట్లు తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూసీ సుందరీకరణ పేరుతో రూ.వేల కోట్ల స్కాంకు తెర లేపిందని కేటీఆర్ ఆరోపించారు. అనంతరం కూకట్‌పల్లి నాలాను పరిశీలించారు.ఈ మేరకు నాలాను శుద్ధి చేయాలని అధికారులను కోరారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలను నెరవేర్చలేదన్నారు. ముఖ్యంగా డబుల్ బెడ్రూం విషయంలో ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసం చేశారన్నారు. ఇక, హైడ్రా పేరుతో పేదలకు ఒక న్యాయం, ధనవంతులకు మరో న్యాయం చేస్తున్నారని విమర్శలు చేశారు.  అలాగే ఎస్టీపీల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని చెప్పారు.

Also Read: బీజేపీ ట్రాప్‌లో కేటీఆర్‌, డామిట్.. కథ అడ్డం తిరిగింది?

Related News

Weather News: మళ్లీ వర్షాలు స్టార్ట్.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వర్షం..

CM Revanth Reddy: హైవే ప్రాజెక్టులపై.. సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

Suryapet News: సూర్యాపేటలో హై టెన్షన్.. పోలీసులను ఉరికించి ఉరికించి.. బీహార్ బ్యాచ్ అరాచకం

Indrakiladri Sharannavaratri: తెలంగాణలో అంగరంగ వైభవంగా.. భద్రకాళి అమ్మవారి ఉత్సవాలు

Bathukamma Kunta: బతుకమ్మ కుంటకు ప్రాణం పోసిన హైడ్రా.. 25న సీఎం చేతులు మీదుగా ప్రారంభం

Singareni Employees: దసరా కానుకగా సింగరేణి కార్మికులకు భారీ బోనస్‌.. ఒక్కొరికి ఎంతంటే?

Hydra Ranganath: కబ్జాలకు చెక్.. అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై రంగనాథ్ ఏమన్నారంటే..

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో కుండపోత వానలు పడే ఛాన్స్..

Big Stories

×