E-Paper
Advertisement

Devara Second Single: దేవర సెకండ్ సింగిల్ వచ్చేసిందిరోయ్.. ఎన్టీఆర్ రొమాన్స్ నెక్స్ట్ లెవెల్ అంతే

Devara Second Single: దేవర సెకండ్ సింగిల్ వచ్చేసిందిరోయ్.. ఎన్టీఆర్ రొమాన్స్ నెక్స్ట్ లెవెల్ అంతే
Advertisement

Devara Second Single: ఎప్పడెప్పుడు అంటూ ఎదురుచూసిన తరుణం రానే వచ్చింది. దేవర సెకండ్ సింగిల్ ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దేవర. నందమూరి ఆర్ట్స్ మరియు యువ సుధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ ఆలీఖాన్ విలన్ గా కనిపిస్తున్నాడు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక దేవర నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ ఏ రేంజ్ లో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సాంగ్ వైలెంట్ గా ఉండడంతో రెండో సాంగ్ రొమాంటిక్ గా ఉంటుంది అని మొదటి నుంచి హింట్ ఇచ్చినవిషయం తెల్సిందే. దీంతో ఈ రొమాంటిక్ సాంగ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూసారు. తాజాగా ఆ సాంగ్ రిలీజ్ అయ్యింది.

Advertisement

చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ ఒక ఎత్తు అయితే.. అనిరుధ్ మ్యూజిక్ మరో ఎత్తు. ఇక విజువల్స్ కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ప్రేమించినవాడు అంటే ఎంత మనసో, ఎంత మక్కువో, ఎంత మోజో ప్రేయసి చెప్పుకొచ్చినట్లు ఉన్న ఆ లిరిక్స్ అద్భుతం. శిల్పా రావు  తన మత్తెక్కించే వాయిస్ తో అదరగొట్టగా జాన్వీ తన అందాలతో సాంగ్ కే కొత్త కళ తీసుకొచ్చింది.

ఇక ముందు నుంచి చెప్పినట్లుగానే ఎన్టీఆర్ క్యూట్ స్టెప్స్ అదిరిపోయాయి. ఎన్టీఆర్- జాన్వీ రొమాన్స్ ఫ్రెష్ ఫీల్ ను కలిగిస్తుంది. ఈ సాంగ్ కూడా చార్ట్ బస్టర్ లిస్ట్ లో చేరుతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే సెప్టెంబర్ 27 న దేవర ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Advertisement

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×