E-Paper
Advertisement

Deavara Release Trailer: ఇప్పుడు అందరి ఆశలు ఈ ట్రైలర్ పైనే.. ఇది కనుక క్లిక్ అయితే..

Deavara Release Trailer: ఇప్పుడు అందరి ఆశలు ఈ ట్రైలర్ పైనే.. ఇది కనుక క్లిక్ అయితే..
Advertisement

Deavara Release Trailer: ఆరు రోజులు.. ఆరంటే ఆరు రోజులు మాత్రమే ఉంది దేవర రిలీజ్ కి.. ఎప్పుడెప్పుడు సెప్టెంబర్ 27 వస్తుందా ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురుచస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

రిలీజ్ డేట్  దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇక దేవర ట్రైలర్ రిలీజ్ తరువాత.. సినిమాపై ఒక నెగెటివ్ టాక్ వచ్చిన విషయం తెల్సిందే. ట్రైలర్ చూస్తుంటే.. ఆంధ్రావాలా లా ఉందని, ఆచార్య 2 అని.. భీమా రీమేక్ అని ఇలా రకరకాలుగా చెప్పుకొస్తున్నారు. దీంతో సినిమాపై చాలా అంటే చాలా నెగెటివీటి పెరిగిపోయింది. దేవర ప్లాప్ అని చెప్పుకొచ్చేస్తున్నారు. ఇంకోపక్క ఎన్టీఆర్, కొరటాల.. ఈ సినిమా కథ చాలా బావుందని, సినిమా చూస్తేనే తెలుస్తుందని చెప్పుకొస్తున్నారు.

Advertisement

అయితే కొరటాల.. తన నమ్మకాన్ని ప్రేక్షకులకు కలిగించాలి. అంటే ట్రైలర్ లో ఎంత హైప్ ఇస్తే థియేటర్ కు అంత ఎక్కువమందిని తీసుకురాగలడు. మొదటి ట్రైలర్ ఎలాగూ ఫెయిల్ అయ్యింది. కానీ, ఈసారి రెండో ట్రైలర్ మాత్రం అదిరిపోతోంది అని అంటున్నారు. అవును.. మీరు వింటుంది నిజమే.. దేవర నుంచి రెండో ట్రైలర్ కూడా రానుంది. రేపు దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక హైదరాబాద్ లోని నోవాటెల్ లో గ్రాండ్ గా జరగనుంది.

ఇక ఈ ఈవెంట్ లో దేవర రిలీజ్ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారట. ఈ ట్రైలర్ కు మాత్రం ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఏ వంక పెట్టకుండా ఉండేలా ప్లాన్ చేశారట. దీంతో ప్రస్తుతం అందరి ఆశలు ఈ ట్రైలర్ పైనే ఉన్నాయి. ఒకవేళ ఇది కనుక క్లిక్ అయితే.. దేవర మొదటి రోజే పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్నట్లే. మరి ఈ ట్రైలర్ లో కొరటాల  ఎలాంటి సీన్స్, షాట్స్ ను పొందుపరిచాడో చూడాలంటే రేపటివరకు ఆగాల్సిందే.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×