BigTV English

Brown Rice: బ్రౌన్ రైస్ తింటే నిజంగానే షుగర్ కంట్రోల్‌ చేసుకోవచ్చా..?

Brown Rice: బ్రౌన్ రైస్ తింటే నిజంగానే షుగర్ కంట్రోల్‌ చేసుకోవచ్చా..?

Brown Rice: ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల ఆహార పదార్థాలు తినాల్సి ఉంటుంది. ముఖ్యంగా అన్నం తింటేనే కడుపు నిండుగా అనిపిస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్న కాలంలో చాలా రకాల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. ముఖ్యంగా బీపీ, షుగర్, అధిక బరువు వంటి సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో చాలా మంది బియ్యం కంటే ఎక్కువగా బ్రౌన్ రూస్ తినడానికి ఇష్టపడుతున్నారు. ఇది గోధుమ రంగులో ఉంటుంది. దీనిని బాగా శుభ్రంగా కడిగితే తెల్లటి రైస్ కనిపిస్తుంది. అయితే బ్రౌన్ రైస్ తినడం వల్ల బరువు తగ్గవచ్చని, షుగర్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చని అందరూ భావిస్తుంటారు. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు బ్రౌన్ షుగర్ తినడం వల్ల అసలు లాభాలు ఉంటాయా, నష్టాలు ఉంటాయా అనేది తెలుసుకోవాల్సి ఉంది. అయితే దీనికి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.


నార్మల్ రైస్ తినడం కంటే బ్రౌన్ రైస్ తినడానికి చాలా మంది అస్సలు ఇష్టపడరు. ఇవి రుచికి సరిగా ఉండవని, కాస్త లావుగా కూడా ఉంటాయని తినలేక కొన్ని రోజుల పాటు తిని మానేస్తుంటారు. కానీ బ్రౌన్ రైస్ తినడం వల్ల ఆరోగ్యానికి పుష్కలమైన ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. బ్రౌన్ రైస్ లో విటమిన్స్, ఫైబర్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన చాలా రకాల సమస్యలను కూడా తగ్గిస్తుంది. బ్రౌన్ రైస్ లో ఉండే ఫైబర్ పేగుల కదలికలను సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. మరోవైపు మలబద్ధకం వంటి సమస్యల నుంచి నివారణ కల్పించేందుకు అద్భుతంగా తోడ్పడుతుంది.


బరువు తగ్గాలనుకునే వారు బ్రౌన్ రైస్ తినడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారు. వైట్ రైస్ లో ఫైబర్ తక్కువగా ఉండడం వల్ల ఇది ఎక్కువ మేలు చేసే అవకాశం ఉండదు. అందువల్ల బ్రౌన్ రైస్ చాలా ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇక రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించేందుకు కూడా ఇది అద్భుతంగా తోడ్పడుతుంది. అందువల్ల షుగర్ ఉన్నవారు బ్రౌన్ రైస్ తినడం వల్ల చాలా మేరకు షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు.

ఎముకల ఆరోగ్యాన్ని ధృఢంగా ఉంచేందుకు బ్రౌన్ రైస్ సహాయపడుతుంది. మరోవైపు గుండె సంబంధింత సమస్యలను కూడా నివారిస్తుంది. మరోవైపు చెడు కొలస్ట్రాల్ వంటి సమస్యలను కూడా బ్రౌన్ రైస్ సహాయపడుతుంది.

(గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.)

Related News

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Big Stories

×