EPAPER

Devara : ఏపీలో తారక్ బలం చూపించబోతున్నారా.. సక్సెస్ మీట్‌ ఉద్దేశ్యం ఇదేనా..?

Devara : ఏపీలో తారక్ బలం చూపించబోతున్నారా.. సక్సెస్ మీట్‌ ఉద్దేశ్యం ఇదేనా..?

Devara : దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) సోలో హీరోగా దేవరా సినిమాతో సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరొకవైపు మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి, భారీ సక్సెస్ అందుకున్న కొరటాల శివ, ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇలా ఇద్దరు లెజండ్స్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా భారీగా కలెక్షన్లు వసూళ్లు చేస్తుంది. మొదటి రోజే అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా మూడవ స్థానాన్ని దక్కించుకుంది. విడుదలైన మూడు రోజుల్లోనే రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసినట్లు చిత్ర బృందం పోస్టర్ తో సహా విడుదల చేసిన విషయం తెలిసిందే.


గుంటూరులో దేవర సక్సెస్ మీట్..

ఇదిలా ఉండగా ప్రస్తుతం భారీ కలెక్షన్స్ వసూళ్లు చేస్తూ రికార్డు సృష్టిస్తున్న ఈ సినిమా కోసం సక్సెస్ మీట్ నిర్వహించాలని చూస్తోంది చిత్ర బృందం. అందులో భాగంగానే గుంటూరు జిల్లా పెద్దకాకాని మండలంలో అక్టోబర్ 3వ తేదీన సక్సెస్ మీట్ ఫంక్షన్ ఏర్పాటుకు సోమవారం రోజు నిర్వాహకులు స్థలాన్ని కూడా పరిశీలించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో ఈ సక్సెస్ మీట్ నిర్వహించనుండగా , చిత్ర యూనిట్ ఇందులో పాల్గొనబోతున్నారని , పెద్ద ఎత్తున అభిమానులు కూడా ఈ వేడుకకు రాబోతున్నారని సమాచారం.


ప్రీ రిలీజ్ క్యాన్సిల్ పై పలు రకాల అనుమానాలు..

ఇదిలా ఉండగా ఈ సక్సెస్ మీట్ నిర్వహించడం వెనక కూడా పెద్ద కారణం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. సెప్టెంబర్ 27న సినిమా విడుదలయ్యింది. విడుదల కంటే మూడు రోజుల ముందు హైదరాబాదులో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే అనుకున్న దానికంటే ఎక్కువ మంది అభిమానులు రావడంతో పోలీసులు కంట్రోల్ చేయలేక ఈవెంట్‌ను క్యాన్సిల్ చేశారు. అయితే ఇలా క్యాన్సిల్ చేసినప్పుడు కూడా చాలామంది. రాయలసీమతో పాటు మరికొన్ని ప్రాంతాల నుంచి ప్రత్యేకమైన వాహనాలలో వేలాది మందిని హైదరాబాదుకి ఎన్టీఆర్ తరలించారు అనే వార్త తెరపైకి తీసుకొచ్చారు. అనుకున్న దానికంటే ఎక్కువ మంది రావడం వల్లే పోలీసులు కంట్రోల్ చేయలేక ఈవెంట్ ను క్యాన్సిల్ చేశారు అంటూ కూడా కామెంట్లు వచ్చిన సంగతీ తెలిసిందే.

ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడానికి కారణం ఎన్టీఆర్?

ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో ఎన్టీఆర్ తన బల నిరూపణ చేసుకోవాలని అనుకున్నాడని, అందుకోసమే రాయలసీమ నుంచి ప్రత్యేక వాహనాలలో వేలాది మంది అభిమానులను హైదరాబాదుకు తీసుకొచ్చాడనే వార్త వినిపించింది. కానీ దీనిపై ఎటువంటి క్లారిటీ లేదు. మరోవైపు సక్సెస్ మీట్ ఈ రేంజ్ లో ఓపెన్ ఈవెంట్ నిర్వహించడంపై ఎన్టీఆర్ ఉద్దేశం ఏమిటి? ఏపీలో తన సత్తా ఏంటో చూపించాలని ఈవెంట్ చేస్తున్నారా? అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా కూటమికి తనకు ఉన్న ఫాలోయింగ్ ఏంటో చూపించాలని ఎన్టీఆర్ ఇలా చేస్తున్నట్లు కూడా వార్తలు వైరల్ చేస్తూ ఉండడం గమనార్హం.

2024 ఎన్నికలే విస్మయానికి కారణం..

ఇక అసలు విషయంలోకి వెళితే 2024 ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వానికి ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున సపోర్ట్ చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ను కూటమి ప్రభుత్వం అవమానించింది అని ఎన్టీఆర్ అభిమానులు అనుకున్నారు. అయితే ఈ అనుమానాలు లేవనెత్తడానికి కారణం నందమూరి బాలకృష్ణ. అటు ఎన్టీఆర్ ఇటు కళ్యాణ్ రామ్ ను పూర్తిగా దూరం పెట్టారనే వార్తలు వినిపించడమే. ఎన్నికలలో ఎన్టీఆర్ సపోర్ట్ చేయకపోతే కూటమి గెలిచేది కాదు అని కొంతమంది కామెంట్లు చేస్తే, మరి కొంతమంది కూటమి విజయం పైన ఎన్టీఆర్ ఎఫెక్ట్ ఏమీ లేదని కామెంట్లు చేస్తున్నారు.

బల నిరూపణ కోసమేనా..

మరి ఇలాంటి సమయంలో ఓపెన్ ఈవెంట్ ఎన్టీఆర్ చేయడం వెనుక ఉద్దేశం తన బల నిరూపణ మాత్రమేనని స్పష్టమవుతుందంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా తనకు లక్షలాదిమంది అభిమానులు అండగా ఉన్నారని.. ఆంధ్ర ప్రదేశ్ కి ఈ ఈవెంట్ తో చెప్పబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే ఎన్టీఆర్ దేవర సక్సెస్ మీట్ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.

Tags

Related News

OG: బాబాయ్ కంటే ముందు ఓజీ క‌థ నేను విన్నా – వరుణ్ తేజ్

Jani Master: కొరియోగ్రాఫర్ జానీకి భారీ షాక్.. నేషనల్ అవార్డు రద్దు!

Srinu Vaitla : బ్రూస్ లీ డిజాస్టర్ సినిమా కాదు, ఆ సినిమా మంచి లాభాలను తీసుకువచ్చింది

Priyamani: ఇప్పటికీ టార్గెట్ చేస్తూ.. నరకం చూపిస్తున్నారు.. హీరోయిన్ ఎమోషనల్..!

OG Update: పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఓజీ’ నుండి క్రేజీ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్

Harudu Glimpse: కమ్ బ్యాక్ కోసం సిద్ధమయిన హీరో వెంకట్.. ‘హరుడు’ నుండి గ్లింప్స్ విడుదల

Posani: ఎన్ – కన్వెన్షన్ కూల్చడం కరెక్టే.. పోసాని షాకింగ్ కామెంట్..!

×