BigTV English

Devara : ‘దేవర’ను చంపింది వాడే… యతి రోల్ తో పాటు సెకండ్ పార్ట్ లో దిమ్మ తిరిగే ట్విస్ట్ లు ప్లాన్ చేసిన కొరటాల

Devara : ‘దేవర’ను చంపింది వాడే… యతి రోల్ తో పాటు సెకండ్ పార్ట్ లో దిమ్మ తిరిగే ట్విస్ట్ లు ప్లాన్ చేసిన కొరటాల

Devara : మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ మూవీ మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే సినిమాని చూసిన ఆడియన్స్ మూవీ సెకండ్ పార్ట్ గురించి మాట్లాడుకుంటున్నారు. అందులోనూ యతి అనే క్యారెక్టర్ ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. అంతేకాకుండా బాబి డియోల్ పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారని టాక్ బయటకు రావడంతో ఆయన పార్ట్ 1లో ఎందుకు కనిపించలేదు? అసలు సెకండ్ పార్ట్ ఎలా ఉండబోతోంది? అనే విషయంపై డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం ‘దేవర’ పార్ట్ 2లో కొరటాల మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ లు ప్లాన్ చేశారని తెలుస్తోంది. మరి ఇంతకీ ఈ యతి క్యారెక్టర్ ని ఎవరు పోషిస్తున్నారు ? బాబి డియోల్ క్యారెక్టర్ సంగతేంటి? అనే విషయాల గురించి తెలుసుకుందాం పదండి.


యతి క్యారెక్టర్ అమ్మాయా అబ్బాయా?

దేవర సినిమాలో ఉన్న మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ యతినే. అయితే ఈ పాత్రలో కనిపించబోయేది అమ్మాయా… అబ్బాయా… అనేది ఆసక్తికరంగా మారింది. కొంతమంది అబ్బాయి యతిగా కనిపించబోతున్నాడు అంటుంటే మరి కొంత మంది అమ్మాయి నటిస్తోందని అంటున్నారు. బాహుబలిలో శివగామి పాత్రను పోషించిన రమ్యకృష్ణను గుర్తు చేస్తూ ఈ సినిమాలో యతి క్యారెక్టర్ పోషించబోయే లేడీ ఆర్టిస్ట్ పాత్రకు కూడా అంతే వెయిట్ ఉంటుందని, ఆ పాత్ర ద్వారా తెరపై మరో శివగామిని చూసే ఛాన్స్ ఉంటుందని టాక్ నడుస్తోంది. కానీ తాజా సమాచారం ప్రకారం ఆ క్యారెక్టర్ లో ఒక హీరో నటించబోతున్నాడు అని తెలుస్తోంది. మరి ఆ హీరో తెలుగా? లేక తమిళ హీరోనా అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది.


బాబీ డియోల్ క్యారెక్టర్ ఎక్కడ?

ఇక ‘దేవర’ మూవీ రిలీజ్ కావడానికంటే ముందు నుంచి బాబీ డియోల్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రను పోషిస్తున్నాడనే వార్త చక్కర్లు కొడుతోంది. కానీ తీరా తెరపై చూస్తే ఆయన కనీసం క్లైమాక్స్ లో కూడా కనిపించలేదు. దీంతో బాబీ డియోల్ క్యారెక్టర్ ని కట్ చేశారా? అనే అనుమానాలు నెలకొనగా, లేదు లేదు బాబీ డియోల్ పాత్ర సెకండ్ పార్ట్ లో ఉంటుందని టాక్ నడుస్తుంది. ఇక మోస్ట్ సస్పెన్స్ క్యారెక్టర్ యతిని పోషించింది కూడా బాబీ డియోల్ అనే టాక్ నడుస్తుంది. అతనే మెయిన్ విలన్ అని సమాచారం. అంతేకాకుండా అతనే ‘దేవర’ను చంపాడు అని అంటున్నారు.

సినిమాలో నీటి అడుగున చచ్చి పడి ఉన్నది ఎవరు?

సినిమాలో అంత ఎగ్రెసివ్ గా ఉన్న సైఫ్ అలీ ఖాన్ చివరికి ఎందుకు అలా మారాడు అంటే.. అతనికి తెలియదు కదా దేవర చనిపోయాడని, పైగా కొడుకునే చంపినోడు తమను వదిలి పెడతాడా? అనే ఆలోచన కూడా అని చెప్పవచ్చు. పైగా క్లైమాక్స్ నుంచి పోస్ట్ క్లైమాక్స్ తర్వాత పార్ట్ 2 లో ఇంటర్వెల్ నుంచి అది మనకు సింక్ అవుతుందని అంటున్నారు.  ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాలో నీటి అడుగున పడి ఉన్నది ఎవరు? ఎందుకు? అనేది సెకండ్ పార్ట్ లో ఇంటర్వెల్ ట్విస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.  ఇదంతా తెలిశాక కొరటాల పార్ట్ 2 కోసం అదిరిపోయే ప్లాన్ చేశారని సంబర పడిపోతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.

Related News

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Mother Teresa : మదర్ తెరిస్సా 115 జయంతి.. సేవా కార్యక్రమాలలోలయన్స్ క్లబ్, హెల్ప్ ఫౌండేషన్!

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big Stories

×