Musi redevelopment project: హైడ్రా, మూసీ ప్రక్షాళనను ఎందుకు బీఆర్ఎస్ అడ్డుకుంటోంది? నిజంగా పేదల తరపున ఆ పార్టీ పోరాటం చేస్తుందా? కొంతమందిని కాపాడేందుకు పేద, మధ్య తరగతి వర్గాల వారిని రెచ్చగొడుతుందా? వీటి పేరిట దోచుకున్నదెంత? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతోంది.
దేశంలో అత్యంత కాలుష్యమైన నది ఏదంటే ముందుగా గుర్తు కొచ్చేది మూసీ. ఈ విషయాన్ని అనేక పర్యావరణ రిపోర్టులు చెబుతున్నాయి. ఈ లెక్కన మూసీ నది ఏ స్థాయిలో కలుషితమైందో అర్థమవు తోంది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో మూసీ వెంబడి దాదాపు 26 లక్షల మంది జీవిస్తున్నారు. కాలువ వెంబడి కేన్సర్ కారణాలు ఆర్సెనిక్, క్రోమియం, కాపర్, నికెల్, లెడ్ వంటి రసాయనాలను గుర్తించినట్టు ఎన్జీఆర్ఐ పేర్కొంది.
హైదరాబాద్‌లో చెరువుల ఆక్రమణలో 80 శాతం బీఆర్ఎస్ నాయకులు, బిల్డర్లే ఉన్నారని ఆరోపించారు టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్ గౌడ్. దీనిపై సోషల్ మీడియాలో లేనిపోని అబద్దాలు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఇప్పటివరకు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఒక్క గుడిసె తీయలేదన్నారు.
నది మధ్యలో ఉన్న కొన్ని కట్టడాలు తొలగిస్తున్నారని చెప్పుకొచ్చారు టీపీసీసీ. మూసీ కాలువకు కుడి, ఎడమ వైపు ఇళ్లులు తొలగించలేదన్నారు. గడిచిన పదేళ్లలో ఎంత కలుషితమైందో స్వయంగా రిపోర్టు చెబుతున్నాయి. ఆక్రమణల వెనుక బీఆర్ఎస్ నేతలతో కొందరు బీజేపీ నేతలున్నారని గుర్తు చేశారాయన.
ALSO READ: మహిళా కమిషన్ ఛైర్మన్ ఆకస్మిక తనిఖీలు, ఆపై ఆగ్రహం..
మూసీ వ్యవహారంలో బీఆర్ఎస్ వ్యవహారశైలిని తప్పుబట్టారు మరో కాంగ్రెస్ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. మూసీ ప్రక్షాళనను అడ్డుకోడమంటే ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు మరణ శాసనం రాయడమేనన్నారు. మూసీ పేరు చెప్పి కారు పార్టీ వెయ్యి కోట్లు రూపాయలు వెనుకేసుకుందన్నది ప్రధాన ఆరోపణ.
ఈ కాలువ ద్వారా పండే పంటలను ఎవరూ తినే పరిస్థితి లేదన్నారు రాజగోపాల్ రెడ్డి. కాటేదాన్, పటాన్ చెరు, జీడిమెట్ల, కూకట్‌పల్లి, సనత్ నగర్, నాచారం, ఏరియాల నుంచి నేరుగా విష రసాయనాలు వదిలేయడం వల్ల మూసీకి ప్రధాన సమస్యగా మారిందన్నారు. దీనికితోడు హెచ్ఎండీఏ పరిధిలో ఇళ్ల నుంచి వచ్చే డ్రైనేజీ సైతం మూసీలో కలుస్తోందన్నారు. లక్షల మంది జీవితాలతో బీఆర్ఎస్ ఆటలాడుతోందని మండిపడ్డారు. మనీ రాజకీయాలు వద్దని కోరారు ఆయన.
చెరువుల ఆక్రమణలో 80 శాతం బీఆర్ఎస్ నాయకులు, బిల్డర్లే ఉన్నారు.
: టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు. pic.twitter.com/1skVnJ4lbi
— Telangana Congress (@INCTelangana) September 30, 2024
మురికి కూపంగా మారిన మూసి నది ప్రక్షాళన దిశగా మా ప్రభుత్వం..#MusiRiver pic.twitter.com/crcpN4GW73
— Komatireddy Raj Gopal Reddy (@rajgopalreddy_K) September 30, 2024