Big Stories

Devil Movie : కాస్ట్లి మోహైర్‌ ఊల్‌ తో హీరో కాస్ట్యూమ్స్ .. డెవిల్ మేకర్స్ రిస్క్ చేశారేమో..

Devil Movie Latest update

Devil Movie Latest update(Telugu film news):

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం డెవిల్. పీరియాడిక్ జోనర్ లో వచ్చే ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ లుక్స్ చిత్రంపై మంచి పాజిటివ్ బజ్ నెలకొల్పాయి. బింబిసార హిట్ తర్వాత కళ్యాణ్ రామ్ మూవీస్ పై అంచనాలు కాస్త భారీగానే ఏర్పడుతున్నాయి. దీనికి తగ్గట్టు ఇప్పుడు రాబోయే ఈ మూవీ స్టోరీ బ్రిటిష్ కాలం నాటి ఓ పైకి సంబంధించింది కావడంతో.. మూవీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అన్న టాక్ వినిపిస్తోంది.

- Advertisement -

ఇక మూవీ పీరియాడికల్ డ్రామా కాబట్టి మేకర్ చిత్రానికి బాగా ఖర్చు పెడుతున్నట్లు టాక్. సినిమాలో చూపించే ప్రతి ఎలిమెంట్ ప్రస్తుతానికి సంబంధించింది కాకపోవడం.. ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి సందర్భాలను లైవ్లీగా చూపించాల్సి రావడం తో ఈ మూవీకి అయ్యే ఖర్చు కూడా భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. పైగా మూవీ కంప్లీట్ గా సెట్స్ లోనే తీయాల్సిన పరిస్థితి.. ఒకప్పటి ఎన్విరాన్మెంట్ చూపించాలి అంటే సెట్లు ఏర్పాటు చేయడం ఎంత కష్టమో కదా.

- Advertisement -

దానికి తోడు కళ్యాణ్ రామ్ లుక్కుపై కూడా అత్యంత జాగ్రత్త వహించినట్లు టాక్. మరీ ముఖ్యంగా అతను వేసుకునే కాస్ట్యూమ్స్ విషయంలో ఎక్కడా తేడా రాకుండా చూసుకోవాలి.. వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి వాడే వస్తువుల వరకు అన్ని బ్రిటిష్ కాలానికి చెందినవై ఉండాలి. లేకపోతే మన వాళ్లు ఇట్టే పసిగట్టేస్తారు.. దీంతో పూర్తి మూవీ ఇమేజ్ పై ప్రభావం పడుతుంది. అందుకే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా డెవిల్ మూవీ మేకర్స్ ఫుల్ స్వింగ్లో ఖర్చు పెట్టారు. ఈ నేపథ్యంలో కళ్యాణ్ రామ్ వేసుకున్న కాస్ట్యూమ్స్ కి సంబంధించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ మూవీ లో ఎక్కువ శాతం కళ్యాణ్ రామ్ కుర్తా ,ధోతి, బ్లేజర్‌ వంటి కాస్ట్యూమ్స్ లో కనిపిస్తాడట. అప్పటి తెలుగింటి సంప్రదాయం ఉట్టిపడే విధంగా.. ఇప్పటి ట్రెండ్ కు మ్యాచ్ అయ్యేలా.. కళ్యాణ్ రామ్ కాస్ట్యూమ్స్ ను ఎంతో పర్ఫెక్ట్ గా డిజైన్ చేయించారట. ఇక ఇందులో కళ్యాణ్రామ్ వేసుకున్న బ్లేజర్ కోసం ఇటలీలో లభ్యమయ్యే ఖరీదైన మోహైర్‌ ఊల్ ను తెప్పించారని మూవీ యూనిట్ సభ్యుల సమాచారం. అంతేకాదు ఇందులో కళ్యాణ్ రామ్ సుమారు 90 కు పైగా భిన్నమైన.. విభిన్నమైన కాస్ట్యూమ్స్ తో కనిపిస్తాడట.

దీంతో కళ్యాణ్ రామ్ కు సంబంధించిన కాస్ట్యూమ్స్ డిజైన్ చేసే డిజైనర్ కి కూడా భారీ ఎత్తున ఖర్జూ అయిందని తెలుస్తోంది. ఇక ఈ మూవీలో మిగిలిన నటీనటులకు కూడా ఆ కాలానికి సెట్ అయ్యే విధంగా ప్రత్యేకమైన ఔట్ ఫిక్స్ ను డిజైన్ చేయించడం కోసం పెద్ద మొత్తాన్ని నిర్మాత ఖర్చు చేశాడని సమాచారం. మొత్తానికి భారీ బడ్జెట్ తో.. భారీ అంచనాలతో.. ప్రేక్షకుల ముందుకు వస్తున్న డెవిల్ చిత్రం ..బింబిసార తరహాలో మంచి సక్సెస్ అందుకుంటుంది అని మూవీ యూనిట్ సభ్యులు గట్టి నమ్మకంతో ఉన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News