BigTV English

Triptii Dimri : యానిమల్ వైల్డ్ సీన్స్ .. తల్లిదండ్రుల అభిప్రాయం బయటపెట్టిన త్రిప్తి ..

Triptii Dimri :  యానిమల్ వైల్డ్ సీన్స్ .. తల్లిదండ్రుల అభిప్రాయం బయటపెట్టిన త్రిప్తి ..
Triptii Dimri latest news

Triptii Dimri latest news(Bollywood celebrity news):

యానిమల్ మూవీలో అన్ని పాత్రలు ఒక ఎత్తు.. కనిపించింది గట్టిగా 20 నిమిషాలైనా రెండు పాత్రలు సృష్టించిన రికార్డు మరొక ఎత్తు. ఇందులో మొదటిది విలన్ గా ఇచ్చిన బాబీ డియోల్ పాత్ర కాగా.. రెండవది తన అందాల ఆరబోతతో కుర్ర కారు మది దోచిన త్రిప్తి డిమ్రి అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ప్రస్తుతం కుర్ర కారు డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది త్రిప్తి. యానిమల్ మూవీ తర్వాత ఆమె సందీప్ వంగా ,ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న స్పిరిట్ మూవీలో నటిస్తుంది అని జోరుగా ప్రచారం జరుగుతుంది.


యానిమల్ మూవీలో.. బోల్డ్ సీన్స్ ఉన్నాయి కానీ..త్రిప్తి, రణబీర్ మధ్య ఉన్న ఘాటైన బెడ్రూమ్స్ స‌న్నివేశాల్లో మాత్రం చాలా డిఫరెంట్ గా ఉండడంతో పాటు.. ప్రస్తుతం యువత మదిలో వాడిగా వేడిగా గుచ్చుకుంటున్నాయి. దీంతో ఈ బ్యూటీ కి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ మూవీలో ఆమె యాక్టింగ్ కి భారీగా గుర్తింపు వచ్చింది. నెక్స్ట్ ప్రభాస్ తో నటిస్తే ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

అయితే ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించి ఒక హాట్ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.త్రిప్తి యానిమల్ మూవీలో.. మంచి హాట్ ఇంటిమేట్ సీన్స్ తో.. ప్రేక్షకులకు కళ్ళు తిప్పుకోలేని ట్రీట్ ఇచ్చింది. చాలామంది ఈ బ్యూటీ ని చూడడానికి సినిమాకి రెండవసారి వెళ్లారని టాక్. అయితే తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ మూవీ చూసిన తన తల్లిదండ్రుల అభిప్రాయం వెల్లడించింది త్రిప్తి. తమ కూతురు నటించిన సన్నిహిత సన్నివేశాలు చూసి.. ఆమె తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారట. తన వృత్తిపరంగా తాను చేస్తున్నది కరెక్టే అని వాళ్ళని కన్విన్స్ చేయడానికి త్రిప్తి కి చాలా టైం పట్టిందట.


నేను నటనపరంగా నా పాత్ర పోషిస్తున్నానే తప్ప ఏ తప్పు చేయడం లేదు అని ఎంత చెప్పినా వారు ఒక పట్టాన ఒప్పుకోలేదట. అయితే త్రిప్తి మాత్రం తనకు ఎటువంటి ఇబ్బంది ఎదురు కాకుండా ..సౌకర్యవంతంగా.. సురక్షితంగా ఉన్నంతవరకు ఇటువంటి సీన్స్ నటించడానికి తనకు ఎటువంటి ఇబ్బంది లేదు అని అంటుంది. ఇంతకుముందు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించిన త్రిప్తి .. ఇంటిమేట్ సీన్స్ తీసే సమయంలో తనకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా డైరెక్టర్ సందీప్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని వెల్లడించింది.

సెట్స్ లోకి ఎవరిని అనుమతించేవారు కాదట.. డైరెక్టర్, యాక్టర్స్ కాక గట్టిగా ఇంకొక నలుగురైదుగురు మాత్రమే షూటింగ్ సమయంలో ఉండేవారట. షూటింగ్ జరిగినంత సేపు తనకి ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో అని ఒకటికి పది సార్లు హీరో ,డైరెక్టర్ కనుక్కునే వారట. ఇక మూవీలో ఆమె నటించిన కొన్ని సీన్స్.. మొదట్లో వాళ్ల తల్లిదండ్రులకు నచ్చకపోయినా.. విషయం అర్థం చేసుకోవడానికి వాళ్ళకి కాస్త సమయం పట్టింది అని చెప్పింది.మొత్తానికి ఒక్క సినిమా తోటి ఈ బ్యూటీ సెన్సేషన్ గా మారిపోయింది.

Related News

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Big Stories

×