E-Paper
Advertisement

Ramam Raghavam Teaser: కొడుకు ఎదుగుదల కోసం ఒక తండ్రి పడే ఆవేదన..

Ramam Raghavam Teaser: కొడుకు ఎదుగుదల కోసం ఒక తండ్రి పడే ఆవేదన..
Advertisement

Ramam Raghavam Teaser: స్టార్ కమెడియన్ ధనరాజ్ డైరెక్టర్ గా మారిన విషయం తెల్సిందే. ఆయన దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న చిత్రం రామం రాఘవం. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్, నటుడు సముద్రఖని ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాను స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై పృధ్వీ పోలవరపు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. టీజర్ ను బట్టి సినిమా తండ్రీకొడుకుల కథలా అనిపిస్తుంది. ఏ తండ్రికి అయినా ఎదిగిన కొడుకు ప్రయోజకుడు కావాలని కోరుకుంటాడు. ఆ ప్రక్రియలో కొడుకు మీద తన ప్రేమను కాస్త కఠినముగా చూపిస్తాడు. ఈ టీజర్ లో కూడా అదే చూపించారు.

ధనరాజ్ కు చదువు రాదు.. సంపాదించే తెలివి లేదు.. అందుకే నిత్యం తన తండ్రి అయినా సముద్రఖనితో తిట్లు తింటూనే ఉంటాడు. అలా ధనరాజ్ ఒక చేయకూడని తప్పు చేస్తే కన్నకొడుకును పోలీసులకు పట్టించడానికి కూడా వెనుకాడడు సముద్రఖని. అయితే ఇదంతా తండ్రికి తనపై ప్రేమ లేకపోవడం వలనే అని కొడుకు తప్పుగా అర్ధం చేసుకుంటాడు. మరిచివరికి కొడుకు ప్రయోజకుడు అయ్యాడా.. ? అసలు తండ్రి ఎందుకు అంత కఠినంగా ఉన్నాడు.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

సముద్రఖని తండ్రి పాత్రలు కొత్తేమి కావు. రఘువరన్ బిటెక్ లో ఇలాంటి పాత్రలోనే ఆయన నటించి మెప్పించాడు. ఇప్పుడు ఈ టీజర్ చూసినా కూడా అదే గుర్తుకు రాకమానదు. ఏ తండ్రి అయినా కోరుకొనేది కొడుకు ఎదుగుదలనే. కొడుకు ముందు కఠినంగా ఉన్నా.. అతడు లేనప్పుడు అతడి గురించే ఆలోచించే వ్యక్తి నాన్న. ఈ సినిమా ప్రతి తండ్రీకొడుకులకు కనెక్ట్ అవుతుందని టీజర్ ను బట్టే తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ధనరాజ్ డైరెక్టర్ గా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×