Big Stories

Shashank Singh: పంజాబ్ కింగ్స్ మెరుపు వీరుడు శశాంక్ సింగ్..

Shashank Singh: కోల్‌కతా నైట్ రైడర్స్‌పై చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడి, అసాధ్యమనుకున్న టార్గెట్ ను సుసాధ్యం చేసిన శశాంక్ సింగ్ పేరు నేడు నెట్టింట మార్మోగిపోతోంది. ఒకవైపు జానీ బెయిర్ స్టో చేసిన సెంచరీ ఉన్నాసరే, తనకి సపోర్ట్ ఇచ్చేవాడు ఉండాలి కదా.. అదే శశంక్ సింగ్ చేశాడని అంటున్నారు.

- Advertisement -

కేవలం 28 బంతుల్లో 8 సిక్స్‌లు, 2 ఫోర్ల సాయంతో 68 పరుగులు చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇక్కడందరూ ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి. మనం ఎంత గొప్పగా ఆడినా, మ్యాచ్ విజయం సాధిస్తే, వచ్చే మజాయే వేరు, అదే అందరికీ గుర్తుంటుంది. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది కాబట్టి, శశాంక్ చేసిన పరుగులకి అంత విలువ పెరిగింది.

- Advertisement -

ఐపీఎల్ లో చాలామంది ఎంతో గొప్పగా ఆడుతున్నారు. కానీ కొంత మంది ఆటతీరే ప్రజలకి గుర్తుండిపోతోంది. అలాంటి వాటిలో శశాంక్ సింగ్ ఇన్నింగ్స్ ఒకటని నెటిజన్లు పేర్కొంటున్నారు. అయితే ఒక నెటిజన్ చేసిన కామెంట్ వైరల్ గా మారింది.

అదేమిటంటే శశాంక్ ఇప్పటివరకు ఐదు మ్యాచ్ లు ఆడాడు. వీటిలో నాలుగు మ్యాచ్ ల్లో నాటౌట్ గా నిలిచాడు. అంతేకాదు తనెందుకు టీ 20 ప్రపంచకప్‌నకు అర్హుడు కాడో బీసీసీఐ చెప్పాలని డిమాండ్ చేశాడు.
ముఖ్యంగా లక్నోపై 7 బంతుల్లో 9 నాటౌట్, తర్వాత గుజరాత్ పై 29 బంతుల్లో 61 నాటౌట్…
ఇక్కడ కూడా పంజాబ్ గెలిచింది.
సన్ రైజర్స్ పై 25 బంతుల్లో 46 నాటౌట్ గా నిలిచాడు.
ఇక ముంబై ఇండియన్స్ పై 25 బంతుల్లో 41 చేసి అవుట్ అయ్యాడు.
తాజాగా కోల్‌కతా పై 28 బంతుల్లో 68 నాటౌట్ గా నిలిచాడు.. ఇందులో పంజాబ్ గెలిచింది.

ఇప్పుడందరూ అనేమాట ఏమిటంటే.. టీ 20 ప్రపంచకప్ కు శశాంక్ ను ఎంపిక చేయాలని అంటున్నారు. అందుకు మద్దతు కూడా పెరిగిపోయింది. మరోవైపు టీమ్ మేనేజ్మెంట్ కి, బీసీసీఐ సెలక్షన్ కమిటీకి పెద్ద సవాల్ గా మారనుందని అంటున్నారు.

Also Read: టీ 20 ప్రపంచకప్ 2024.. ఐసీసీ అంబాసిడర్‌గా యువరాజ్ సింగ్..

ఎందుకంటే ఐపీఎల్ కూటీ 20 మ్యాచ్ లు కావడం, ప్రపంచకప్ కూడా అదే కావడంతో ఇప్పుడిక రెండో ఆప్షన్ లేదు. వాళ్లు వన్డేలకు పనిచేస్తారు, వీరు టెస్టులకు పనిచేస్తారని విభజించే అవకాశం లేదు. ఇక్కడ ఆడితే, అక్కడికి తీసుకువెళ్లాల్సిందే అన్నట్టు ఉంది, మరి శశాంక్ సింగ్ రేస్ లో ఉంటాడా? లేదా? అనేది వేచి చూడాల్సిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News