E-Paper
Advertisement

Rajinikanth: మామ ఆఖరి కోరిక తీర్చిన అల్లుడు.. భార్యతో కలిసిపోయిన ధనుష్.. ?

Rajinikanth: మామ ఆఖరి కోరిక తీర్చిన అల్లుడు.. భార్యతో కలిసిపోయిన ధనుష్.. ?
Advertisement

Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఆయన ఎంత స్టార్ అయినా కూడా.. తన బిడ్డలను మాత్రం స్టార్స్ ను చేయలేకపోయాడు. రజినీకి ఇద్దరు కూతుళ్లు.  సౌందర్య రజినీకాంత్, ఐశ్వర్య రజినీకాంత్.  హీరోయిన్స్ గా కాకుండా ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు నిర్మాతలుగా మారారు. కానీ, అందులో  ఇప్పటివరకు సక్సెస్ కాలేకపోయారు. తండ్రిగా   రజినీ.. వారికి  తోడుగా ఉన్నా కూడా విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు.

ఇక రజినీ పెద్ద కూతురు ఐశ్వర్య రజినీకాంత్ గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్  భార్యగా ఆమె అందరికీ సుపరిచితమే. అయితే ధనుష్- ఐశ్వర్య విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. 18 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నట్లు వారు తెలిపారు.  ఇక వీరిని కలపడానికి ఇరు కుటుంబాలు శాయశక్తులా  ప్రయత్నించారు. కానీ. తాము మాత్రం కలిసేది లేదని నిర్మొహమాటంగా తెలిపారు.

Advertisement

Lavanya Tripathi: సతీ లీలావతిగా మారిన మెగా కోడలు.. ?

ఇక ఈ ఏడాదిలోనే వీరి విడాకుల కేసు కోర్టుకు వచ్చింది. కానీ, ఆ కేసుకు వీరిద్దరూ హాజరుకాకపోవడంతో మళ్లీ వీరు కలిసిపోనున్నారని వార్తలు వచ్చాయి.  ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఆ వార్తలు నిజమయ్యాయని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ధనుష్- ఐశ్వర్య కలిసే ఉంటున్నారట. అంతేకాదు ఈ దీవాళీని కూడా ఈ జంట కలిసే సెలబ్రేట్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీరు కలవడానికి రజినీనే కారణమని అంటున్నారు.

Advertisement

ఈ మధ్యనే రజినీ అనారోగ్యానికి గురైన విషయం తెల్సిందే. గుండెల్లో ఆయనకు స్టంట్ వేశారు. ప్రస్తుతం రజినీ ఆరోగ్యం కుదుటపడింది. ఇంటికి వచ్చాకా.. ఆయన.. కూతురు అల్లుడు తో మాట్లాడినట్లు తెలుస్తోంది. కూతురు – అల్లుడు కలిసి ఉండాలని కోరుకుంటున్నానని, అదే తన ఆఖరి కోరిక అని చెప్పడంతో ధనుష్- ఐశ్వర్య కొద్దిగా అలోచించి విడాకులను రద్దు చేసుకోనున్నట్లు కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.  త్వరలోనే ధనుష్- ఐశ్వర్య మళ్లీ జంటగా మీడియా ముందుకు రానున్నారు. ఈ విషయం తెలియడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు అని చెప్పాలి. మరి ఇది నిజం అవుతుందో లేదో చూడాలి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×