E-Paper
Advertisement

Lavanya Tripathi: సతీ లీలావతిగా మారిన మెగా కోడలు.. ?

Lavanya Tripathi: సతీ లీలావతిగా మారిన మెగా కోడలు.. ?
Advertisement

Lavanya Tripathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠి గురించి ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  అందాల రాక్షసి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ భామ.. స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపునే అందుకుంది. ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ప్రేమలో పడి.. గతేడాది మెగా కోడలిగా అడుగుపెట్టింది. పెళ్లి తరువాత లావణ్య సినిమాలు  చేయదు అనుకున్నారు.. కానీ, అమ్మడు మాత్రం రూట్ మార్చి వరుస సినిమాలను లైన్లో పెడుతుంది. అయితే గ్లామర్ పాత్రలకు ఇక గుడ్ బై చెప్పినట్లే అని మాత్రం చెప్పుకొస్తున్నారు.

ఇప్పటికే పెళ్లి తరువాత ఆమె నటించిన వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్ మంచి విజయాన్ని అందుకుంది. ఇక దీని తరువాత లావణ్య మరో కొత్త సిరీస్ లో నటిస్తున్నట్లు సమాచారం.  ఈ మధ్యనే ఆమె ప్రెగ్నెంట్ అంటూ వార్తలు కూడా పుట్టుకొచ్చాయి. కానీ అందులో నిజం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో  బిజీగా మారింది.  మెగా కోడలు ఒక కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.

Advertisement

Rana comments on Mr Bachchan: లాస్ట్ కి అవార్డు తీసుకునే స్టేజ్ మీద కూడా హరీష్ శంకర్ ని ట్రోల్ చేశారు

అందుతున్న సమాచారం ప్రకారం సతీ లీలావతి అనే  టైటిల్ తో ఒక సినిమా రానుందట. ఇక ఆ టైటిల్ రోల్ లో లావణ్య  నటిస్తుందని టాక్ నడుస్తోంది.  ఆమె పక్కన హీరోగా ఒక యంగ్  హీరో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా ఆ యంగ్ హీరో ప్రియదర్శి అని మాట్లాడుకుంటున్నారు. ఒక స్టార్ ప్రొడ్యూసర్ ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు సమాచారం.

Advertisement

సతీ లీలావతి అనే టైటిల్ తో ఇప్పటికే కమల్ హాసన్ సినిమా వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమాలో  కామెడీ  ఉన్నట్లే.. ఈ సినిమాను కూడా  కామెడీతో నింపనున్నారట. భార్యాభర్తల మధ్య గొడవలు, సరదాలు.. బంధం గొప్పతనం ఇలాంటివన్నీ వినోదాత్మకంగా  చూపిస్తూ చివర్లో మంచి మెసేజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా  ప్రకటించనున్నారని సమాచారం. మరి ఈ సినిమాతో మెగా కోడలు ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×