E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Rayan Movie Twitter Review: ‘రాయన్’ ట్విట్టర్ రివ్యూ.. ధనుష్, సూర్య నటన హైలైట్?

Rayan Movie Twitter Review:  ‘రాయన్’ ట్విట్టర్ రివ్యూ.. ధనుష్, సూర్య నటన హైలైట్?
Advertisement

Raayan Twitter Review: గ్లోబల్ స్టార్ ధనుష్ తన కెరీర్‌లో 50వ సినిమాగా ‘రాయన్’తో వచ్చాడు. ఈ చిత్రానికి ధనుష్ దర్శకత్వం వహించగా.. కళానిధి మారన్ నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. ఈ మూవీలో యంగ్ హీరో సందీప్ కిషన్, అపర్ణ బాలమురళి, కాళిదాస్ జయరామ్, వరలక్ష్మి శరత్ కుమార్, దుషారా విజయన్, ఎస్‌జె సూర్య, ప్రకాష్ రాజ్ వంటి స్టార్ కాస్టింగ్ ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, సాంగ్స్, టీజర్, ట్రైలర్ ఇలా ప్రతి ఒక్కటీ భారీ అంచనాలు క్రియేట్ చేశాయి.

ఇవాళ ఈ సినిమా గ్రాండ్‌ లెవెల్లో రిలీజ్ కానుంది. అంతకంటే ముందు ‘రాయన్’ ప్రీమియర్స్ షో వేశారు. ఇక ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా వారి రివ్యూలను పంచుకుంటున్నారు. రాయన్ ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉందని అంటున్నారు. అయితే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ మరింతగా అదిరిపోయిందని కామెంట్లు పెడుతున్నారు. అంతేకాకుండా ధనుష్ మాస్ ఎంట్రీ ఓ రేంజ్‌లో ఉందని ట్వీట్లు చేస్తున్నారు. అలాగే ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ బ్యాంగ్ పిచ్చ మాస్‌గా ఉందని అంటున్నారు.

Advertisement

Also Read: రాయన్.. బ్రహ్మా రాక్షసుడులా వస్తాడు.. దహనం చేస్తాడు

ఇందులో ధనుష్ అండ్ ఎస్ జే సూర్య యాక్టింగ్ ఇరగదీసేసినట్లు చెప్పుకొస్తున్నారు. అలాగే సందీప్ కిషన్, దుషార కూడా తమ నటనతో మెప్పించారని ఓ రివ్యూవర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశాడు. అయితే ఇదొక ఫేక్ ట్వీట్ అని తెలుస్తోంది. ఎందుకంటే ఇంకా అమెరికాలో ప్రీమియర్ షోస్ పడలేదు. ఆలస్యం అయినట్లు తెలుస్తోంది. సాధారణంగా తెలుగు చిత్రాలకు ఇండియాలో తెల్లారేసరికి అమెరికాలో ప్రీమియర్స్ పడటం జరుగుతుంది. కానీ రాయన్ ప్రీమియర్స్ ఇంకా అక్కడ పడలేదు.

Advertisement

అయితే డిస్ట్రిబ్యూటర్స్ అండ్ వాళ్ల స్నేహితులు ఈ సినిమా చూశారట. అక్కడి నుంచి ఈ సినిమాకు హిట్ టాక్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. తమిళనాడులో అక్కడక్కడా మార్నింగ్ షోలు పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ మూవీ మంచి హిట్ కొట్టేలా ఉందని కొందరు ట్వీట్లు చేస్తున్నారు. ఇందులో ధనుష్, ఎస్ జే సూర్యల యాక్టింగ్ అదిరిపోయిందని అంటున్నారు. దీంతో థియేటర్ల వద్ద హంగామా ఓ రేంజ్‌లో ఉందని తెలుస్తోంది. చూడాలి మరి కొన్ని గంటల్లో ఈ సినిమా పూర్తి రివ్యూ వచ్చేదాక.

https://twitter.com/_Mr_S_007/status/1816616389760942302?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1816616389760942302%7Ctwgr%5Eee72cb1a0e270e19f423647c034ecd1c30f57942%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.abplive.com%2Fentertainment%2Fcinema%2Fraayan-movie-twitter-review-in-telugu-dhanush-sj-surya-performance-steal-the-show-172986

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

×