BigTV English

Gagan Narang Paris Olympics 2024: ఏదో ఒక పతకంతో భారత్‌కి వెళ్లడం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్

Gagan Narang Paris Olympics 2024: ఏదో ఒక పతకంతో భారత్‌కి వెళ్లడం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్

Gagan Narang on Paris Olympics 2024: మరికొద్ది గంటల్లో ఒలింపిక్స్ గేమ్స్ ప్రారంభం కానున్నాయి. అయితే ప్రతీ క్రీడాకారుడు కూడా చాలా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. మొత్తం 32 క్రీడాంశాల్లో 10,500 మంది క్రీడాకారులు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్ ఒలింపిక్స్ కి ‘చెఫ్ ది మిషన్’గా గగన్ నారంగ్ ఉన్నాడు. ఈ సందర్భంగా తను మాట్లాడుతూ ఈసారి మనవాళ్లు ఫుల్ ఎనర్జిటిక్ గా ఉన్నారని అన్నాడు.


ఏదో ఒక పతకంతో భారతదేశానికి వెళ్లడం కాదు.. కచ్చితంగా బంగారు పతకం సాధించే వెళతామని ఆత్మవిశ్వాసంతో చెప్పాడు. నేను కూడా అదే విధంగా ప్రోత్సహించినట్టు తెలిపాడు. గతంతో పోల్చితే ఇప్పుడు మన అథ్లెట్లలో ఆత్మవిశ్వాసం పెరిగిందని అన్నాడు.

ఎందుకంటే మన దేశంలో ప్రత్యేకంగా ఒలింపిక్స్ కోసం ప్రత్యేక శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేశారు. దేశ విదేశాల నుంచి కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిపుణులైన కోచ్ లను తీసుకొచ్చారని తెలిపాడు. వారందరి నేతృత్వంలో ఉన్నత స్థాయి శిక్షణతో అద్భుతంగా రాటు దేలారని అన్నాడు. అందుకే అంత ఆత్మవిశ్వాసంతో చెబుతున్నట్టు తెలిపాడు. ఇది ముందెన్నడూ జరగలేదని తెలిపాడు. కేంద్ర క్రీడాశాఖ, శాయ్, ఐటీఏ మధ్య సహకారం బాగుందని తెలిపాడు.


ప్రజలు కూడా ఒక్క క్రికెట్ నే కాదు, అన్నిక్రీడలను ఆదరిస్తున్నారని తెలిపాడు. ఇదొక శుభపరిణామమని అన్నాడు. నేనిప్పటికి నాలుగోసారి ఒలింపిక్స్ లో భారత్ తరఫున పాల్గొంటున్నాను. ఇప్పుడు నాకు అరుదైన గౌరవం దక్కిందని తెలిపాడు. ఇదెంతో బాధ్యతతో కూడుకున్నదని తెలిపాడు.

Also Read: హర్బజన్ మాట.. పాక్‌కు వెళ్లకపోవడమే మంచింది, ఎందుకంటే..

ఒలింపిక్స్ లో మనవాళ్ల ఆటను చూడాలి, వారిని ప్రోత్సహించాలని తెలిపాడు. ఒక ప్లేయర్ గా ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నానని తెలిపాడు. ఇప్పుడు 117 మంది బాధ్యత నాపై ఉందని అన్నాడు. ఇంకెంత టెన్షన్ గా ఉంటుందో ఆలోచించండి అని అన్నాడు. ప్రతీ క్రీడాకారుడికి ఒత్తిడి ఉంటుంది, దానిని అధిగమించడంలోనే విజయం ఆధారపడి ఉంటుందని అన్నాడు.

దీనికి నెటిజన్లు ఒక ఉదాహరణ చెబుతున్నారు. టీ 20 ప్రపంచకప్ ఫైనల్ లో హార్దిక్ పాండ్యా వేసిన ఆఖరి ఓవర్ ను గుర్తు చేస్తున్నారు. అంత ఒత్తిడిని జయిస్తూ అద్భుతంగా బౌలింగు చేయడం సాధారణమైన విషయం కాదని అంటున్నారు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ పాల్గొనే ఒలింపిక్స్ లో ఆడటమంటే అదంత ఆషామాషీ వ్యవహారం కాదని అంటున్నారు. మరి చూడాలి మనవాళ్లు ఎలా తిరిగి వస్తారోనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Related News

IND Vs PAK : అభిషేక్ శర్మ ఫాలోయింగ్ చూడండి.. పాకిస్తాన్ లేడీ కూడా లవ్ యూ చెప్పింది!

IND Vs PAK : అంపైర్లు అమ్ముడుపోయారు.. అది నాటౌట్… షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు

IND Vs PAK : గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం : రవూఫ్ భార్య

IND Vs PAK : దుబాయ్ స్టేడియంలో పాకిస్థాన్ ఫ్యాన్ పై దాడి… రంగంలోకి పోలీసులు!

Fakhar Zaman catch : టీమిండియా తొండాట‌…ఐసీసీకి పాకిస్థాన్ ఫిర్యాదు

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మకు గ్రౌండ్ లోనే ప్ర‌పోజ్‌..ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి మ‌రీ !

IND VS PAK: మ‌రోసారి టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌..చ‌చ్చిన పామును మ‌ళ్లీ చంప‌డ‌మే

AK-47 Celebration: ధోని చేస్తే క‌రెక్ట్‌.. మేం చేస్తే త‌ప్పా…!

Big Stories

×