Adi Narayana Reddy comments on Jagan(AP Politics): ఏపీ బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి వైసీపీ అధినేత జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ ఒక్కరే రూ.2 లక్షల కోట్లు దోచేశారని ఆరోపించారు. అంతే కాకుండా వైసీపీ ఐదేళ్ల పాలనలో రూ. 5 లక్షల కోట్లు స్వాహా చేసిందని అన్నారు. రాష్ట్రంలో ఎటు చూసినా వైసీపీ చేసిన అక్రమాలు, కబ్జాలు మాత్రమే కనిపిస్తున్నాయని అన్నారు. వాటి గురించి ప్రజలను మరల్చేందుకు వైసీపీ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి సున్నా అని ఎద్దేవా చేశారు. త్వరలోనే వైసీపీ కూడా అదే పరిస్థితికి వస్తుందని విమర్శించారు. మాజీ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి సహా వైసీపీకి చెందిన నేతలు అనేక మంది వైసీపీ నేతలంతా జైలుకు వెళ్లడం ఖాయం అని హెచ్చరించారు. దస్త్రాల దహనం, కాలువలో పారేయడం వంటి చర్యలకు వైసీపీ నేతలు పాల్పడ్డారని అన్నారు.
Also Read: జగన్ రేషన్..బాబు పరేషాన్
జగన్ పాలనలో జరిగిన మద్యం విక్రయాల్లోనే భారీ కుంభకోణం బయటపడుతుందని తెలిపారు. అంతే కాకుండా వైసీపీకి రాజకీయాలు లేకుండా చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనే భయంతోనే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం కల్పించారని అన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో కబ్జాలు, తప్పులు జరగని ప్రాంతం లేదని విమర్శించారు.