BigTV English

Samantha: నాగ చైతన్య చివరి గుర్తును కూడా చెరిపేసిన సామ్.. రెండో పెళ్లికి రెడీ ?

Samantha: నాగ చైతన్య చివరి గుర్తును కూడా చెరిపేసిన సామ్.. రెండో పెళ్లికి రెడీ ?

Samantha: స్టార్ హీరోయిన్ సమంత  ఎట్టకేలకు గతం తాలూకూ జ్ఞాపకాల నుంచి బయటపడింది అనిపిస్తుంది. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ భామ.. మొదటి సినిమాతోనేతెలుగు ప్రేక్షకుల గుండెల్లో జెస్సీగా కొలువుడిపోయింది. ఇక మంచి మంచి కథలను ఎంచుకుంటూ స్టార్ హీరోల సరసన అంటించి..  టాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్ గా ఎదిగింది. తాను నటించిన మొదటి సినిమా హీరో అక్కినేని నాగ చైతన్యతో  ప్రేమలోపడి.. డేటింగ్ చేసి, ఇరువర్గాల కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకుంది.


 

చై- సామ్ మధ్య బంధం ఎంతో అందంగా ఉండేది. చైని పెళ్లి చేసుకునేటప్పుడు సామ్ ముఖంలో ఆనందం చూసినవారందరూ.. ప్రతి అమ్మాయి డ్రీమ్ అంటూ చెప్పుకొచ్చారు. ఇక తన ప్రేమకు గుర్తుగా సామ్..  తన వీపు మీద ఏ మాయ చేసావే సినిమా షార్ట్ ఫార్మ్ YMC అనే అక్షరాలను టాటూ వేయించుకుంది. పెళ్లి తరువాత చై – సామ్ కలిసి చేతిపై మరో టాటూను వేయించుకున్నారు. ఈ రెండు కాకుండా సామ్ నడుముపై చై పేరును టాటూగా వేయించుకుంది. ఇక.  ఎంతో అనోన్యంగ ఉండే ఈ దంపతుల మధ్య విభేదాలు తలెత్తడంతో.. ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు.


 

గొడవలు ఎవరి వలన అయ్యాయి అనేది ఇప్పటివరకు క్లారిటీ రాలేదు కానీ, విడాకుల తరువాత సామ్ బాగాకృంగిపోయింది.  ట్రోల్స్, వివాదాలు, మయోసైటిస్.. ఇలా అన్నింటిని తట్టుకొని స్ట్రాంగ్ గా నిలబడింది. కొద్దిగా కోలుకున్నాకా.. సామ్ తన గతం తాలూకు జ్ఞాపకాలను చెరిపివేయడం మొదలుపెట్టింది.  మొదటిగా ఈ చిన్నది.. చై టాటూను చెరిపివేయడంతో పాటు.. అతనితో గడిపిన మూమెంట్స్ మొత్తాన్ని  తుడిచేసింది. ఆ తరువాత చేతిపై ఉన్న టాటూను కూడా తీయించేసింది. ఈ రెండు టాటూలకు చైకి  దగ్గరగా ఉంటాయి. అందుకే చెరిపేసింది అనుకోవచ్చు. కానీ, ఇప్పుడు YMC టాటూను కూడా సామ్ చెరిపేసినట్లు తెలుస్తోంది.

 

YMC చైకి మాత్రమే కాదు సామ్ కి కూడా చాలా స్పెషల్. ఆ సినిమానే ఆమెజీవితాన్ని మార్చేసింది. ఆ లెక్కన ఆ టాటూ ఉన్నా కూడా అది ఆమెకు ఎంతో స్పెషల్ కాబట్టి ఉంచుకుంది అని అనుకోవచ్చు. కానీ, చై ఉన్న ఏ ఒక్కదాన్ని సామ్ తన లైఫ్ లో ఉంచుకోవాలనుకోవడం లేదని స్పష్టంగా తెలుస్తోంది.  తాజాగా దాచడానికి ఏమి లేదు అనే క్యాప్షన్ తో సామ్ ఒక పోస్ట్ పెట్టింది. అందులో రెడ్ కలర్ బ్యాక్ లెస్  డిజైనర్ డ్రెస్ లో సామ్ కనిపించింది. బ్యాక్ మీద YMC టాటూ కనిపించకపోవడంతో దాన్ని కూడా తీయించేసిందని తెలుస్తోంది.

 

దాచడానికి ఏమి లేదు అనే క్యాప్షన్.. ఈ బ్యాక్ లెస్ డ్రెస్ రెండింటిని బట్టి చూపించడం వెనుక తన టాటూ తీయించేశాను. ఇక దాచడానికి ఏమి లేదు.. మొత్తం చెరిపేశాను అని చూపిస్తుందా.. ? లేక గతం తాలూకూ జ్ఞాపకాలు మొత్తం చెరిపేసాను.. రెండో పెళ్లికి సిద్దమవుతున్నాను అని హింట్ ఇస్తుందా అనేది తెలియాల్సి ఉంది. మరి ఈ పోస్ట్ వెనుక ఉన్న అర్ధం ఏంటి అనేది తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

Related News

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Kissik Talks Promo : మహేష్ విట్టా లవ్ స్టోరిలో ఇన్ని ట్విస్టులా..ఆ ఒక్క కోరిక తీరలేదు..

Ritu Chaudhary : చెప్పు రీతు నువ్వు నన్ను మోసం చేయలేదా? రీతుకి కళ్యాణ్ తో బంధం తెగిపోయిందా?

Bigg boss emmanuel : నా బాధ మీకు తెలియదు, రోజు దుప్పటి కప్పుకుని ఏడుస్తాను

Big Stories

×