E-Paper
Advertisement

Dil Raju: అవును.. వారిని మేమే చెడగొట్టాం.. దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు

Dil Raju: అవును.. వారిని మేమే చెడగొట్టాం.. దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
Advertisement

Dil Raju: ఓటీటీ వచ్చాక.. థియేటర్ కు వెళ్లి చూసేవారి సంఖ్య తగ్గింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. డబ్బులు పెట్టుకొని.. అంతంత దూరం వెళ్లి, కుటుంబంతో కలిసి వెళ్లి ఇబ్బంది పడడం కన్నా.. హాయిగా ఇంట్లో కూర్చొని, పిల్లా పాపలతో సినిమాలు చూడడం నయం అని అనుకుంటున్నారు ప్రేక్షకులు. ప్రేక్షకులు ఓటీటీకి దగ్గర కావడానికి ఇదొక్కటే కారణం కాదు.

థియేటర్ లో టికెట్ కు అంత డబ్బు పెట్టి వెళ్లి.. సినిమా బాగోకపోతే.. ప్రతి ప్రేక్షకుడు అనే మాట.. అనవసరంగా టికెట్ డబ్బులు ఖర్చుపెట్టాను. ఆ డబ్బులతో ఓటీటీ లో నెల మొత్తం సినిమాలు చూడొచ్చు అని,కేవలం నాలుగువారాల్లోనే ఓటీటీలో వస్తుంది కాదా .. థియేటర్ లో ఏం చూస్తాంలే అని లైట్ అని.. ఇలా రకరకాల కారణాలతో ప్రేక్షకులు ఓటీటీలకు దగ్గరవుతున్నారు. అయితే నిజమైన కారణం ఏంటి అంటే.. మేకర్స్.. ప్రేక్షకులకు థియేటర్ కు రాకుండా చెడగొడుతున్నారు.

Advertisement

ఇక ఈ విషయాన్ని దిల్ రాజు సైతం ఒప్పుకున్నాడు. తాజాగా రేవు అనే సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతూ.. ” అవును.. ప్రేక్షకులను మేమే చెడగొడుతున్నాం. థియేటర్ లో మూవీ రిలీజ్ అయిన నాలుగు వారాలకే .. ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాం. దీని వలన ప్రేక్షకులు.. థియేటర్ కు రావడం లేదు. మీరు ఇంట్లో ఉండే.. సినిమాను చూసుకోండి ని ప్రోత్సహిస్తూ.. మేమే వారిని చెడగొడుతున్నాం.

ఇక చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అని కాదు. కథ నచ్చితే థియేటర్ లో ఎక్కువ రోజులు ఆడుతుంది. కమిటీ కుర్రోళ్ళు నిదానంగా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని ముందుకు వెళ్తుంది. అది ఎక్కువ రోజులు ఉంటుంది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Advertisement

ఇక దిల్ రాజు వ్యాఖ్యలతో చాలామంది ఏకీభవిస్తున్నారు. ఆయన చెప్పింది నిజమే.. ఓటీటీపై ప్రేక్షకులు మొగ్గుచూపడానికి వారే కారణం. ఒక సినిమాను థియేటర్ లో చూడాలనే ఆసక్తిని మేకర్స్ నే తుంచేస్తున్నారు. మంచి కథలు వస్తే.. ప్రతి ప్రేక్షకుడు థియేటర్ లోనే చూడాలని కోరుకుంటారు అని కామెంట్స్ పెడుతున్నారు.

ఇకపోతే ప్రస్తుతం దిల్ రాజు చేతిలో వరుస ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నితిన్ తమ్ముడు, గేమ్ ఛేంజర్ సినిమాలు ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నాయి. త్వరలోనే రిలీజ్ కానున్నాయి. మరి ఈ సినిమాలతో దిల్ రాజు ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×