Megastar 156 Movie : ఫ్యాన్స్ కు దసరా కానుక.. మెగా 156పై క్లారిటీ..

Megastar 156 Movie :  ఫ్యాన్స్ కు దసరా కానుక.. మెగా 156పై క్లారిటీ..

Megastar 156 Movie
Share this post with your friends

Megastar 156 Movie

Megastar 156 Movie (Chiranjeevi new movie) : దసరా పండక్కి విడుదలయ్యే సినిమాలతో పాటు హీరోలు తమ అభిమానులకు దసరా ట్రీట్ గా రాబోయే సినిమాల గురించి ఏదో ఒక న్యూస్ విడుదల చేస్తూ ఉంటారు. అలా ఈసారి మెగాస్టార్ అభిమానులకు దసరా పండుగ కానుకగా మెగా 156 పోస్టర్ విడుదల చేయడం జరిగింది. చిరంజీవి వశిష్ట కాంబోలో రూపొందుతున్న ఈ మెగా 156 మూవీ కోసం ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు.

సినిమాలకు లాంగ్ గ్యాప్ తీసుకున్న చిరంజీవి ఆచార్య మూవీతో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. కొడుకుతో కలిసి నటించిన ఈ చిత్రం అనుకున్న రేంజ్ లో సక్సెస్ సాధించలేకపోయింది. అయితే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య అంటూ వచ్చి.. బాక్స్ ఆఫీస్ ను బంతి ఆట ఆడేసాడు. ఇక అదే జోరులో వరుస క్రేజీ ప్రాజెక్టుతో బిజీగా ఉన్న చిరంజీవి త్వరలో తన 156 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు.

దసరా సందర్భంగా మెగా ఫాన్స్ కి కానుకగా ఈ మూవీ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేయడం జరిగింది. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ ఫాంటసీ అడ్వెంచరస్‌ మూవీ ఫస్ట్ లుక్ తోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది.ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తోంది. ఇక ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ వివరాల్లోకి వెళ్తే . బ్యాక్ గ్రౌండ్ లో కొండ కోనలు.. ఒకపక్క విధ్వంసం మరొక పక్క ప్రళయం.. మధ్య నుంచి ఉద్భవించిన త్రిశూలం. ఒక్క పోస్టర్ తోటే చిత్రం ఇంపాక్ట్ ను విపరీతంగా పెంచేశారు అనడంలో ఎటువంటి డౌట్ లేదు.

విజయదశమి ఆయుధపూజ సందర్భంగా వదిలిన ఈ పోస్టర్ ఎక్సలెంట్ గా ఉంది. పైగా మెగాస్టార్ నుంచి చాలాకాలం తర్వాత వచ్చిన న్యూస్ కావడంతో ఫాన్స్ దీన్ని తెగ వైరల్ చేస్తున్నారు. పోస్టర్ చూస్తే ఈ మూవీ కచ్చితంగా మంచి మాస్ యాక్షన్ సీక్వెన్స్ తో నిండి ఉంటుంది అనిపిస్తుంది. పైగా వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి ఫుల్ జోష్ లో ఉన్నాడు.. ఒకప్పటి ముఠామేస్త్రి ఈ చిత్రంలో కనిపించడంతో అభిమానులు తెగ ఖుష్ అయిపోయారు. ఇక రాబోయే సినిమాల్లో కూడా చిరంజీవి అదే టెంపో మెయింటెన్ చేస్తారని అందరూ ఆశిస్తున్నారు.

 నిజానికి మెగా 156 మూవీ చిరంజీవి కూతురు సుస్మిత నిర్మాణ సారధ్యంలో రావాల్సిందే. అలాగే మెగా 157 వశిష్ట డైరెక్షన్లో రావాలి. కానీ చిరు తన ఫోకస్ మొత్తం వశిష్ట మూవీ పై పెట్టడంతో ఆ మూవీ ముందు రావడం జరుగుతుంది. దీంతో మెగా డాటర్ చిత్రం వెనక్కి వెళ్లి వశిష్ట మూవీ కాస్త మెగా 156 గా మారింది. అయితే ఈ మూవీకి కాస్ట్యూమ్స్ డిజైనర్ గా సుస్మిత కొణిదల వ్యవహరిస్తున్నారు.మెగా మాస్ బియాండ్ యూనివర్స్…ఎలా ఉంటుందో ఇంతకీ మూవీ విడుదల అయితే కానీ తెలియదు.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Rushikonda Constructions : రుషికొండ నిర్మాణాలపై సుప్రీంలో విచారణ.. పిటిషన్ డిస్ మిస్

Bigtv Digital

CM Jagan : బాబు అరెస్ట్‌పై జగన్ ఫస్ట్ రియాక్షన్.. అంతా ఆయనే చేశారంటూ ట్విస్ట్

Bigtv Digital

Congress : కన్నడ తీర్పు.. కాంగ్రెస్ జోరు.. మేజిక్ ఫిగర్ ఖాయం..!

BigTv Desk

SeetaRama: సీతారాముల రూపం.. టెక్నాలజీ వర్సెస్ పురాణాలు..

Bigtv Digital

KCR : నేడు జోగుళాంబ గద్వాల జిల్లాలో కేసీఆర్‌ పర్యటన.. సాయంత్రం బహిరంగ సభ..

Bigtv Digital

Alekhya Reddy: బాలయ్య సాయం.. భర్తపై అలేఖ్యరెడ్డి ఎమోషనల్ పోస్ట్

Bigtv Digital

Leave a Comment