BigTV English

Disha Patani : హాలీవుడ్ లో బంఫర్ ఆఫర్ పట్టేసిన ప్రభాస్ బ్యూటీ.. ఫిక్స్ వైరల్..

Disha Patani :  హాలీవుడ్ లో బంఫర్ ఆఫర్ పట్టేసిన ప్రభాస్ బ్యూటీ.. ఫిక్స్ వైరల్..

Disha Patani : బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగు ప్రేక్షకులకు ఈమె సుపరిచితమే. మెగా హీరో వరుణ్ తేజ్ తో కలిసి లోఫర్ సినిమాలో నటించింది. ఆ సినిమాలో ఈమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత బాలీవుడ్ లో ఎక్కువగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది రీసెంట్గా గత ఏడాది రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ కల్కిలో ప్రభాస్ సరసన జోడిగా నటించింది. కోట్లలో పారితోషికం అందుకుంది. త‌దుప‌రి క‌ల్కి 2లోను త‌న పాత్రకు స్కోప్ ఉంటుంది. మ‌రో పాన్ ఇండియా చిత్రం కంగువతో అభిమానుల ముందుకు వచ్చింది. కానీ ఆ మూవీ అనుకున్న హిట్ టాక్ అయితే అందుకోలేకపోయింది.. ఆ తర్వాత తెలుగులో ఒక్క సినిమా కూడా అనౌన్స్ చేయలేదు. కానీ ఇప్పుడు ఈ బ్యూటీ గురించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..


బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని భాషతో పని లేకుండా ప్రతి ఇండస్ట్రీలోనూ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ సినిమాలు చేసుకుంటూ పోతుంది. సినిమాలు తోనే కాదు సోషల్ మీడియాలో కూడా ఈ పాప యాక్టివ్గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోల తో కుర్రకారికి నిద్రలేకుండా చేస్తుంది. తన హాట్ లుక్స్ తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.. ఎలాంటి చిన్న పోస్ట్ పెట్టిన కూడా నిమిషంలో లక్షల్లో లైక్ లు, కామెంట్ లు వస్తాయి.. ఇప్పటివరకు దిశ పటాన్ని చేసిందే తక్కువ సినిమాలైనా మంచి క్రేజ్ను అందుకుంది.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లకు గట్టి పోటి ఇస్తుంది. ఇక ఇప్పుడు హాలివుడ్ లోకి ఎంట్రీ ఇస్తోందట దిశా..

హాలీవుడ్ లోకి ఎంట్రీ కి పోతున్నట్టు దిశా పటాని సోషల్ మీడియా ద్వారా తెలిపింది.. హాలీవుడ్ ‘ఫాస్ట్ అండ్ ప్యూరియస్’ మూవీ నటుడు టైరీస్ గిబ్సన్ తో దిశా ఓ వెబ్ సిరీస్ కోసం జత కట్టినట్లు సమాచారం. ప్రస్తుతం చిత్రీకరణ లో ఉన్న ఈ సిరీస్ సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను చూస్తుంటే మెక్సీకో లో షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీ లో హ్యారీ గుడ్విన్స్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. మరి బాలీవుడ్ లో కుర్రకారుని ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ, తన హాట్‌నేస్ తో హాలీవుడ్ లో ఎలాంటి గుర్తింపు సంపాదించుకుంటుందో చూడాలి. ఈ మూవీతో పాటుగా అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించిన ‘వెల్‌కమ్ టు ది జంగిల్’ సినిమాలో కూడా దిశా పటానీ కనిపించనుంది.. మొత్తానికి ఈ బ్యూటీ అయితే చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇక సోషల్ మీడియా లో కూడా హైపర్ యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోల ను షేర్ చేస్తూ ఉంటుంది..


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×