Kiran Abbavaram :ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు ఇండస్ట్రీలో తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకొని ఒక్కటవుతున్నారు. అయితే అలా పెళ్లి చేసుకుంటున్నారో లేదో అప్పుడే తమ జీవితంలోకి కొత్తవారిని ఆహ్వానించడానికి కూడా వీరు సిద్ధం అవుతున్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఇటీవల తన తోపాటు కలిసి నటించిన హీరోయిన్ రహస్య ఘోరక్ (Rahasya ghorak)తో ఏడడుగులు వేశారు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran abbavaram). అయితే పెళ్లి జరిగి ఏడాది కూడా కాలేదు. అప్పుడే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది ఈ జంట. అభిమానుల కోసం పంచుకున్న ఈ ఫోటోలు, చెప్పిన విషయం అటు అభిమానులనే కాదు ఇటు సెలబ్రిటీలను కూడా సంతోష పరుస్తోంది. తాజాగా కిరణ్ అబ్బవరం తన సోషల్ మీడియా ఖాతా X ద్వారా షేర్ చేసుకున్న ఈ ఫోటోలు అభిమానులను సంతోష పరుస్తున్నాయి. మరి అసలేమైందో ఇప్పుడు చూద్దాం..
తల్లిదండ్రులు కాబోతున్న కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్..
తాజాగా రహస్య ప్రెగ్నెంట్ అయింది అంటూ.. ఆమె బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు కిరణ్ అబ్బవరం. తన భార్య తన బేబీ బంప్ ను ఆప్యాయంగా చూసుకుంటున్న వేళ.. వెనుక నుంచి ఆ బేబీ బంప్ ను తన రెండు చేతులతో కిరణ్ పట్టుకున్నారు. ఇక ఆ చూడ చక్కటి ఫోటోని అభిమానుల కోసం పంచుకున్నారు కిరణ్ అబ్బవరం. ప్రస్తుతం ఈ ఫోటో చూసి అటు అభిమానులు, ఇటు సెలబ్రెటీలు ఈ కొత్త జంటకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వాలని ఆశిస్తూ వరుస కామెంట్లు పెడుతున్నారు. మరొకవైపు రహస్య చాలా ప్రశాంతంగా ఒక బుక్ చదువుతున్న ఫోటోని కూడా షేర్ చేయడం జరిగింది. ఏది ఏమైనా పెళ్లి అయిన ఏడాదిలోపే తల్లిదండ్రులు కాబోతున్నామంటూ శుభవార్త తెలియజేయడంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కిరణ్ అబ్బవరం – రహస్య గోరక్ ప్రేమ, పెళ్లి..
ఇకపోతే కిరణ్ అబ్బవరం, రహస్య ఘోరక్ ఇద్దరూ కూడా 2019లో “రాజావారు రాణిగారు” అనే సినిమాలో నటించారు. అదే సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందట. ఇక అందులో భాగంగానే గత ఏడాది మార్చి 13వ తేదీన హైదరాబాదులో వీరి నిశ్చితార్థం జరిగింది. ఇక ఐదేళ్ల ప్రేమకు పులిస్టాప్ పెడుతూ కర్ణాటకలో కూర్గ్ లో 2024 ఆగస్టు 22న వివాహం చేసుకున్నారు.
కిరణ్ అబ్బవరం సినిమాలు..
దీపావళి సందర్భంగా ‘క’ అనే సినిమాను విడుదల చేసి, భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు కిరణ్ అబ్బవరం. ఇక ప్రస్తుతం ‘దిల్ రూబా’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక మరొకవైపు ఈయన భార్య రహస్య ఘోరక్ వివాహం తర్వాత ఇండస్ట్రీకి దూరమైన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తల్లి కాబోతున్నట్లు సమాచారం. మొత్తానికి అయితే కిరణ్ అబ్బవరం ఎట్టకేలకు శుభవార్త చెప్పేశారు.
Our love is growing by 2 feet 👣👼🐣 pic.twitter.com/69gL0sALaZ
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) January 21, 2025