E-Paper
Advertisement

Mogali Rekulu ‘Devi Likitha Kamini’: మొగలిరేకులు దేవి గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉందో చూడండి..!

Mogali Rekulu ‘Devi Likitha Kamini’: మొగలిరేకులు దేవి గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉందో చూడండి..!
Advertisement

Mogali Rekulu Devi Likitha Kamini: సాధారణంగా అబ్బాయిలు సీరియల్స్ చూడరు.. అసలు సీరియల్స్ ఎవరైనా చూస్తారా.. ? అన్నవారి ముందుకు వెళ్లి మొగలిరేకులు సీరియల్ గుర్తుందా.. ? అని అడగండి. అప్పట్లో ఈ సీరియల్ కోసం రక్తాలు చిందించేవాళ్ళం అని చెప్పేవారు. ఇంట్లో టీవీ లేకపోయినా పక్కింటికి వెళ్లి మా అమ్మతో పాటు నేను చూసేవాడిని అని చెప్పే అబ్బాయిలే ఎక్కువమంది ఉంటారు. అంతలా మొగలిరేకులు సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకున్నది. ఆ సీరియల్ లో నటించిన ప్రతి ఒక్కరు ప్రస్తుతం స్టార్స్ గా కొనసాగుతున్నారు.

RK నాయుడు, మున్నా, జేమ్స్, పాటీ, సెల్వ, దయ, సత్య, ఇంద్ర.. ఇలా వారి సొంత పేర్లు మార్చి ఈ పేర్లే ఒరిజినల్ పేర్లుగా మార్చిన సీరియల్. ఇక ఈ సీరియల్ మధ్యలోనే వదిలి వెళ్ళిపోయిన హీరోయిన్ లిఖిత గుర్తుందా.. ? అదేనండీ.. దేవి అనే పాత్రలో మొదటి నుంచి మెరిసి మధ్యలో వెళ్ళిపోయింది. ఆమె లిఖిత. యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించి మంచి సీరియల్స్ లో నటించింది. అంతేకాకుండా పలు సినిమాల్లో హీరోలకు చెల్లెలిగా నటించి మెప్పించింది.

Advertisement

ఇక ఆమె రేంజ్ మార్చేసిన సీరియల్ అంటే మొగలిరేకులు అనే చెప్పాలి. సీరియల్స్ అన్నింటిలో మున్నా- దేవిల ప్రేమకథ చాలా ప్రత్యేకం. సాధారణంగా సీరియల్స్ లో లవర్స్ కు ప్రత్యేకంగా సాంగ్స్ ఉండవు. కానీ, ఈ జంటకు మాత్రం ప్రత్యేకంగా లవ్ సాంగ్స్ కూడా ఉండేవి. నిజంగా బయటకూడా ఈ జంట లవర్స్ అనేంతలా సాగర్- లిఖిత నటించారు. ఈ సీరియల్ కు ఆమె నంది అవార్డును కూడా అందుకుంది. ప్రస్తుతం సాగర్ హీరోగా కొనసాగుతున్నాడు. కానీ, లిఖిత మాత్రం ఎక్కడ ఉంది.. ? ఏం చేస్తుంది..? అని ఎవరికి తెలియదు. అయితే లిఖిత ప్రస్తుతం భర్త, పిల్లలతో కలిసి విదేశాల్లో సెటిల్ అయ్యిందని సమాచారం.

Also Read: Ranveer Singh – Prasanth Varma: 3 రోజుల షూటింగ్ తర్వాత ‘రాక్షస’ నుండి తప్పుకున్న రణవీర్ సింగ్.. కారణం అదే..!

Advertisement

2017 లో లిఖిత.. జయప్రకాశ్ అనే బిజినెస్ మ్యాన్ ను వివాహమాడింది. పెళ్లి తరువాత యాక్టింగ్ కు గుడ్ బై చెప్పిన లిఖితకు ఒక బాబు పుట్టాడు. ఇక ఆ చిన్నారి ఆలనాపాలనా చూసుకుంటూ ఆమె విదేశాల్లోనే ఉంటుందని కొందరు చెప్తుండగా.. మరికొందరు హైదరాబాద్ లోనే ఒక మెహందీ డిజైన్ షాప్ ను నడుపుతుందని చెప్పుకొస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆమె ఎక్కువ యాక్టివ్ గా లేదు. తాజాగా ఆమె ఒక రెస్టారెంట్ లో దిగిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. అప్పటికి ఇప్పటికీ దేవి కొద్దిగా బొద్దుగా మారినట్లు కనిపిస్తుంది. మరి ముందు ముందు లిఖిత రీఎంట్రీ ఏమైనా ఇస్తుందేమో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×