BigTV English

Ranveer Singh out from Rakshs: 3 రోజుల షూటింగ్ తర్వాత ‘రాక్షస’ నుండి తప్పుకున్న రణవీర్ సింగ్.. కారణం అదే..!

Ranveer Singh out from Rakshs: 3 రోజుల షూటింగ్ తర్వాత ‘రాక్షస’ నుండి తప్పుకున్న రణవీర్ సింగ్.. కారణం అదే..!

Ranveer Singh Leaves Prasanth Varma’s ‘Rakshas’ Movie: ప్రముఖ క్రియేటివ్ దర్శకుడు ప్రశాంత్ వర్మకు ‘హనుమాన్’ మూవీతో క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. ఈ మూవీలో అతడి స్క్రీన్ ప్లే, డైరెక్షన్‌కు సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. గ్రాఫిక్స్ కూడా అత్యద్భుతంగా ఉండటంతో సినిమా ఓ రేంజ్‌లో దూసుకుపోయింది. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీసును షేక్ చేసింది. బడా హీరోల సినిమాలను సైతం వెనక్కి నెట్టి సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది.


ఎన్నో రికార్డులను సైతం ఈ మూవీ బద్దలు కొట్టింది. అంతేకాకుండా కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. చిన్న సినిమాగా వచ్చి ఇంతటి బ్లాక్ బస్టర్ టాక్‌ను అందుకోవడమంటే మామూలు విషయం కాదు. ఇక థియేటర్ అనంతరం ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చి అక్కడ కూడా దుమ్ము దులిపేసింది. అయితే ఈ మూవీ రెస్పాన్స్‌తో దర్శకుడు ప్రశాంత్ వర్మ సీక్వెల్‌ను ప్రకటించేశాడు. ‘జై హనుమాన్’ పేరుతో ఈ సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలిపాడు.

ఈ మేరకు జై హనుమాన్ ప్రీ లుక్‌ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశాడు. ఆ పోస్టర్ అందరిలోనూ అంచనాలు పెంచేసింది. ఇదిలా ఉంటే ఈ మూవీతో పాటు దర్శకుడు ప్రశాంత్ తన లైనప్‌లో మరో చిత్రాన్ని ఉంచినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ బడా హీరో రణవీర్ సింగ్‌తో ఓ మూవీ చేస్తున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి ‘రాక్షస’ అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపించింది.


Also Read: రణవీర్ సింగ్ – ప్రశాంత్ వర్మ కొత్త సినిమాకి టైటిల్ ఫిక్స్.. ‘బ్రహ్మరాక్షస’ అంటూ..

ఈ సినిమా కూడా హనుమాన్ మూవీ తరహాలోనే సూపర్ హీరో కథాంశంతో తెరకెక్కబోతున్నట్లు సమాచారం. భారీ టెక్నాలజీని ఉపయోగించి దీనిని రూపొందిస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా ఈ చిత్రాన్ని మన పురాణ ఇతిహాసాల ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రశాంత్ వర్మ సన్నాహాలు చేస్తున్నట్లు టాక్. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో రణవీర్ సింగ్‌పై 3 రోజుల పాటు పలు సన్నివేశాలు కూడా చిత్రీకరించారట.

అయితే సడెన్‌గా ఏమైందో ఏమో కానీ.. ఈ మూవీ నుంచి రణవీర్ సింగ్ తప్పుకున్నాడని తెలుస్తోంది. దర్శకుడు ప్రశాంత్వ వర్మకి, హీరో రణవీర్‌ సింగ్‌కు మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ తలెత్తడంతో రణవీర్ సింగ్ ఈ ‘రాక్షస’ మూవీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. రణవీర్ సింగ్ ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయకూడదని నిర్ణయించుకుంటే.. అతడి మూడు రోజుల చిత్రీకరణను సినిమాలో చేర్చాలని సిబ్బంది యోచిస్తోందని తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Tags

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×