E-Paper
Advertisement

Kota Srinivasarao: కోటాను ఓవర్ నైట్ స్టార్ ను చేసిన సినిమా ఏంటో తెలుసా..?

Kota Srinivasarao: కోటాను ఓవర్ నైట్ స్టార్ ను చేసిన సినిమా ఏంటో తెలుసా..?
Advertisement

Kota Srinivasarao: నటుడు కొత్త శ్రీనివాసరావు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కమెడియన్ గా నవ్వించాలన్నా.. విలన్ గా భయపెట్టాలన్నా.. సపోర్ట్ రోల్స్ లో ఏడిపించాలన్నా.. కోటా తరువాతే ఎవరైనా. ఎన్ని సినిమాలు.. ఎన్ని పాత్రలు.. ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ను మొదలుపెట్టిన కోటా.. అంచెలంచెలుగా ఎదిగిన విధానం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఇక ఏ నటుడుకి అయినా.. ఒక సినిమా వారిని స్టార్ గా మారుస్తుంది. ఆ సినిమా తరువాతనే వారు సెలబ్రిటీగా గుర్తింపు పొందుతారు. అలా కోటాను ఓవర్ నైట్ స్టార్ గా నిలబెట్టిన సినిమా గురించి ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు.

Advertisement

” నాకు ప్రతి ఘటన సినిమా ఎంతో గుర్తింపును తీసుకొచ్చి పెట్టింది. నా కెరీర్ లో ఆ సినిమా ఎంతో కీలకం. దానికన్నా ముందు వందేమాతరం అనే సినిమా చేశాను. ఆ సినిమా సమయంలోనే టి. కృష్ణ ఈ సినిమా కథను చెప్పాడు. కథ చెప్పినప్పుడు అందులో నా పాత్ర చాలా చిన్నది. ఒక పార్టీ అధ్యక్షుడు గా స్పీచ్ ఇవ్వాలి. ఆ సీన్ నా కోసం రాశారు.

సోదరీసోదరీమణులారా అనే డైలాగ్ తో మొదలవుతుంది. నేను ఆ స్పీచ్ మొత్తాన్ని నా శైలిలో తెలంగాణ భాషలో చెప్పాను. అది టి. కృష్ణకు బాగా నచ్చింది. దీంతో నా చిన్న పాత్రను పెద్దదిగా చేశారు. రాత్రికి రాత్రి కూర్చొని నా కోసం 8 సీన్లు రాశారు. షూటింగ్ ఫినిష్ చేశాను. సినిమా రిలీజ్ అయ్యాకా.. నా పాత్రకు ఎంతో గొప్ప పేరు వచ్చింది. ఈ సినిమా.. నన్ను ఓవర్ నైట్ స్టార్ ను చేసింది. ఈ సినిమా తరువాత వెనక్కి  తిరిగి చూసుకోలేదు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వయో వృద్ధాప్యంలో ఉన్న కోటా.. అప్పుడప్పుడు ఒకటి రెండు సినిమాలో కనిపిస్తున్నాడు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×