BigTV English
Advertisement

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో భారత్ రాణించకపోవడానికి రీజన్ ఇదేనా..!

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో భారత్ రాణించకపోవడానికి రీజన్ ఇదేనా..!

These Are The Reasons Why India Did Not Excel In The Olympics: పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్ 2024 లో భారత్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. భారీ అంచనాలతో బరిలోకి దిగి 6 పతకాలతో సరిపెట్టుకున్నారు భారత అథ్లెట్లు. ఒక్క బంగారు పతకాన్ని కూడా సొంతం చేసుకోలేక వెనుదిరిగారు. అంటే ఒక్క ఆటలో కూడా భారత్ విజయం సాధించలేకపోయిందన్నమాట.ఇందులో ఒక రజతం, 5 కాంస్యాలతో పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ప్రస్థానం ఎండ్ అయినట్లే. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే.. భారత్‌ కంటే చాలా చిన్న దేశాలు సైతం ఒలింపిక్స్‌లో బంగారు పతకాలను కైవసం చేసుకున్నాయి. లాస్ట్‌కి మన పొరుగుదేశం పాకిస్థాన్ సైతం ఒక గోల్డ్‌ మెడల్‌ని సాధించి భారత్ కంటే ఒక్క అడుగు ముందు వరుసలో ఉంది. పతకాల ఖాతా తెరిచిన ఎనభై నాలుగు దేశాల్లో భారత్‌ ఒక్కటే 71వ స్థానంలో నిలిచి పాతాళానికి పోయినట్టు అయింది.


ఏళ్లు గడుస్తున్నయి, వందల కోట్లు ఖర్చు చేస్తున్నా సరే.. భారత్‌ పతకాల సంఖ్య మాత్రం అస్సలు రెట్టింపు అవ్వడం మాత్రం కనిపించేలా లేదు. ఒలింపిక్స్‌లో భారత్‌ వైఫల్యానికి గల మెయిన్ కారణాలేంటనే దానిపై దేశవ్యాప్తంగా చర్చలు కొనసాగుతున్నాయి. దేశంలో క్రీడలకు అధిక ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం వల్లనే ఈ ఇష్యూ ఏర్పడుతుందనే వాదన వినిపిస్తోంది. ఒలింపిక్స్ వైఫల్యం నెలకొనడంతో సోషల్‌మీడియా వేదికగా మీమ్స్ ఫన్నీ కామెంట్స్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. క్రికెట్‌కే అధిక ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఒలింపిక్స్‌లో ఉన్న స్పోర్ట్స్‌ గురించి అంత పెద్దగా తెలవకపోవడం ఒక కారణంగా తెలుస్తోంది. అందుకే ఒలింపిక్స్‌లో భారత్ పరాజయానికి ఒక కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా ఒలింపిక్స్‌లో మెడల్స్‌ని ఎక్కువగా భారత్‌కి అందించే అథ్లె్ట్‌లను కేర్ చేయకపోవడం, క్రికెటర్లకు మాత్రమే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, వారికి మాత్రమే ఇండియాలో ఫ్యాన్స్ ఎక్కువగా ఉండటం వంటి వివిధ కారణాలు ఈ వైఫల్యానికి ముఖ్య కారణంగా అభివర్ణిస్తున్నారు వక్తలు. జపాన్, అమెరికా భారత్‌ కంటే చాలా చిన్న దేశాలు. కానీ.. ట్రాక్‌ అండ్ ఫీల్డ్‌ ఈవెంట్స్‌లో మాత్రం దూసుకుపోతున్నాయి.

Also Read: భారత బ్యాడ్మింటన్‌ని ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు


క్రికెట్‌ మ్యాచ్‌ల కోసం ఇతర దేశాలకు వెళ్లే రాజకీయ నేతలు మూవీ సెలబ్రెటీస్ ట్రాక్‌ అండ్ ఫీల్డ్‌ ఇతర స్పోర్ట్స్‌కి మాత్రం వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపట్లేదు. ఇక ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు ఎన్ని పనులున్నా సరే భారత్ అంతా అటు వైపే మొగ్గు చూపుతుంది. అందుకే భారత్‌లోనూ ఒలింపిక్స్‌ తరహాలో నేషనల్ గేమ్స్‌ని కండక్ట్ చేయాలని చాలామంది కోరుతున్నారు. అంతేకాకుండా ఆ టోర్నీకి దేశంలోని ఆయా రాష్ట్రాలు, జిల్లాలు, మండల స్థా్యిలో టోర్నీ నిర్వహించి,, టాలెంట్ ఉన్న అథ్లెట్లను ఉన్నత స్థాయికి తీసుకురావాలంటూ పలువురు నెటిజన్లు సోషల్‌మీడియా వేదికగా కోరుతున్నారు. అంతేకాదు గ్రామీణ స్థాయిలో మట్టిలో మాణిక్యాలను వెలుగులోకి తీసుకొచ్చి తగిన ప్రోత్సాహాన్ని వారికి అందిస్తే క్రీడల్లో రాణించగలరని, ఇందుకు రాజకీయ నాయకుల ప్రోద్భలం అవసరం అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యం కావాలని… క్రీడలకు కెటాయించే బడ్జెట్ పూర్తి స్థాయిలో అమలు పరచడం లేదని అమలు చేసినా వాటిలో కరప్షన్ మాత్రమే ఉంటుందన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఒలింపిక్స్ కోసం వందల కోట్లు ఖర్చు చేశామని కేంద్రం చెబుతున్నా తమకు మాత్రం అంత డబ్బు పెట్టలేదని అశ్విన్ పొన్నప్ప వంటి స్పోర్ట్స్ పర్సన్స్ బహిరంగంగానే వారి ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు.

Related News

Anushka-Kohli: కోహ్లీ – అనుష్క శర్మ విడాకులు ?సోష‌ల్ మీడియాలో దారుణంగా పోస్టులు

WPL Retention 2026 : రిటైన్ లిస్టు ఇదే..WPL 2026 టోర్న‌మెంట్ షెడ్యూల్ ఇదే..!

IND VS AUS 4th T20I : వాషి యో వాషి..3 వికెట్లు తీసిన వాషింగ్ట‌న్‌, కంగారుల‌పై టీమిండియా విజ‌యం

Kajal Aggarwal: టీమిండియా మ్యాచ్ కు కాజ‌ల్‌..భ‌ర్త‌ను హ‌గ్ చేసుకుని మ‌రీ, ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే

Tata Motors: వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన టీమిండియా ప్లేయ‌ర్ల‌కు టాటా బంప‌ర్ ఆఫ‌ర్‌

PV Sindhu: బోల్డ్ అందాలతో రెచ్చిపోయిన PV సింధు.. వెకేషన్ లో భర్తతో రొమాన్స్

IND VS AUS, 4th T20I: టాస్ ఓడిన టీమిండియా..మ్యాక్స్‌వెల్ తో పాటు 4 గురు కొత్త‌ ప్లేయ‌ర్లు వ‌చ్చేస్తున్నారు

Harleen Deol: మోడీ సార్‌.. ఎందుకు ఇంత హ్యాండ్స‌మ్ గా ఉంటారు? హర్లీన్ డియోల్ ఫ‌న్నీ క్వ‌శ్చ‌న్‌

Big Stories

×