BigTV English

Kamna Jethmalani: ‘రణం’ ముద్దుగుమ్మ కామ్నా జెఠ్మలానీ గుర్తుందా.. ఇప్పుడు చూడండి ఎంత హాట్ గా ఉందో.. ?

Kamna Jethmalani: ‘రణం’ ముద్దుగుమ్మ కామ్నా జెఠ్మలానీ గుర్తుందా.. ఇప్పుడు చూడండి ఎంత హాట్ గా ఉందో.. ?

Kamna Jethmalani: కామ్నా జెఠ్మలానీ.. ఈ పేరు ఇప్పటి కుర్రకారుకు గుర్తులేదేమో కానీ, అప్పట్లో ఈ ముద్దుగుమ్మ కోసం అభిమానులు కొట్టుకొని చచ్చేవారు. ముద్దుగునా..బూరి బుగ్గలు వేసుకొని.. కర్లీ హెయిర్ తో అమ్మడు కనిపిస్తే.. దేవతలా పూజించేవారు. 2005 లో ప్రేమికులు అనే సినిమాతో కామ్నా తెలుగుతెరకు పరిచయమైంది. ఈ సినిమా అమ్మడుకు ఆశించినంత ఫలితాన్ని అందివ్వలేకపోయింది కానీ, అవకాశాలను మాత్రం అందించింది.


ప్రేమికులు తరువాత కామ్నా, రణం సినిమాలో నటించింది. గోపీచంద్ సరసన కామ్నా నటించి మెప్పించింది. రణం.. ఆమె కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తరువాత ఆమె తెలుగులో బిజీ హీరోయిన్ గా మారింది. సామాన్యుడు, బెండు అప్పారావుRMP, కత్తి కాంతారావు లాంటి సినిమాల్లో నటించింది. ఇక తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళంలో కూడా తన లక్ ను పరీక్షించుకుంది. సినిమాలు చేస్తున్న సమయంలోనే బెంగళూరుకు చెందిన పారిశ్రామికవేత్త సూరజ్ నాగ్ పాల్ ను వివాహం చేసుకుంది.

పెళ్లి తరువాత అమ్మడు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.సోషల్ మీడియా వచ్చాకా సీనియర్ హీరోయిన్స్. సినిమాలకు దూరంగా ఉన్నా అభిమానులకు దగ్గరగానే ఉంటున్నారు. అలా కామ్నా కూడా తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలు.. పిల్లల ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులకు చేరువగానే ఉంటుంది.


గతేడాది వ్యవస్థ అనే వెబ్ సిరీస్ తో కామ్నా రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఫేమస్ లాయర్ సంపత్ రాజ్ భార్యగా నటించింది. భర్త ఏది చెప్తే అది చేయడానికి వెనుకాడని భార్యగా .. భర్త బిజినెస్ కోసం వేరేవారితో పడుకొనే భార్యగా నటించి మెప్పించింది. ఈ సిరీస్ ఆశించిన ఫలితం అందుకోలేకపోయినా కామ్నాను చూసి అభిమానులు సంతోపడ్డారు.

ఇక తాజాగా ఈ భామ తన బికినీ ఫోటోషూట్ తో సోషల్ మీడియాను షేక్ చేసింది. బోట్ లో బ్లాక్ బికినీతో సముద్రపు అందాలను ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారింది. ఇద్దరు బిడ్డల తల్లి అయినా కూడా కామ్నా తన అందాన్ని మెయింటైన్ చేసే విధానం బావుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ముందు ముందు  కామ్నా సినిమాల్లో రీఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×