BigTV English

Swift High Bookings: రికార్డులు బ్లాస్ట్.. ఫస్ట్‌ప్లేస్‌లోకి కొత్త స్విఫ్ట్.. లెక్కలు ఇవే!

Swift High Bookings: రికార్డులు బ్లాస్ట్.. ఫస్ట్‌ప్లేస్‌లోకి కొత్త స్విఫ్ట్.. లెక్కలు ఇవే!

Swift High Bookings: 2024 ఫోర్త్ జనరేషన్ మారుతి సుజుకి స్విఫ్ట్ గత నెల మే 9న ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయినప్పటి నుండి ప్రకంపనలు సృష్టిస్తోంది. మారుతి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్ పాపులారిటీ దాని లాంచ్ అయిన ఒక నెలలోనే ఈ కారు 40,000 కంటే ఎక్కువ యూనిట్ల బుకింగ్‌లను సొంతం చేసుకుంది. ఇది కాకుండా మారుతి సుజుకి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్ గత నెలలో 19,339 యూనిట్ల కారును సేల్ చేయడం ద్వారా మొదటి స్థానానికి చేరుకుంది. కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ అవుట్ లుక్, ఇంటీరియర్‌లో పెద్ద మార్పులు చేశారు. అప్‌డేట్ చేయబడిన మారుతి స్విఫ్ట్ సేల్స్, దాని ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.


Also Read: ఆధార్ అప్‌డేట్.. జూన్ 14న లాస్ట్.. భారీ మూల్యం తప్పదా?

ప్రస్తుతం అప్‌డేట్ చేయబడినప మారుతి సుజుకి స్విఫ్ట్ మాన్యువల్ వేరియంట్ అత్యధికంగా 83 శాతం బుకింగ్‌ను సంపాదించుకుంది. ఇది కాకుండా 17 శాతం మంది వినియోగదారులు మారుతి సుజుకి స్విఫ్ట్ ఆటోమేటిక్ వేరియంట్‌ను కొనుగోలు చేశారు. మరోవైపు అప్‌డేటెడ్ మారుతి సుజుకి స్విఫ్ట్ మిడ్-స్పెక్ VXI వేరియంట్ 50 శాతం బుకింగ్‌ను పొందిందని కంపెనీ తెలిపింది. ఇప్పుడు కంపెనీ రాబోయే నెలల్లో కొత్త మారుతి స్విఫ్ట్ CNG వేరియంట్‌ను కూడా విడుదల చేయబోతోంది. ఇది కాకుండా ఇటీవల కంపెనీ కొత్త మారుతి స్విఫ్ట్  ఆటోమేటిక్ వేరియంట్‌ల ధరలను రూ. 5,000 తగ్గించింది.


అప్‌డేట్ చేయబడిన మారుతి సుజుకి స్విఫ్ట్ పవర్‌ట్రెయిన్ గురించి మాట్లాడితే.. ఇది 1.2-లీటర్ 3-సిలిండర్ Z-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది మాక్సిమమ్ 82bhp పవర్‌ని, 112Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కారు ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అటాచ్ చేశారు. స్విఫ్ట్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్‌లో లీటరుకు 24.8 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. మారుతి స్విఫ్ట్ పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు 25.75 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

Also Read: మారుతీ నుంచి డ్రీమ్ సిరీస్ కార్లు.. బుకింగ్స్ స్టార్ట్!

మరోవైపు అప్‌డేట్ చేయబడిన మారుతి స్విఫ్ట్ క్యాబిన్‌లో కస్టమర్‌లు 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ ఎసీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది కాకుండా సేఫ్టీ కోసం కారులో స్టాండర్డ్ 6-ఎయిర్‌బ్యాగ్‌లు, వెనుక పార్కింగ్ సెన్సార్, పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లు ఉంటాయి. మారుతి స్విఫ్ట్ మార్కెట్లో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌తో పోటీపడుతోంది. అప్‌డేట్ చేయబడిన మారుతి సుజుకి స్విఫ్ట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర టాప్ మోడల్ కోసం రూ. 6.49 లక్షల నుండి రూ. 9.64 లక్షల వరకు ఉంటుంది.

Tags

Related News

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Big Stories

×