E-Paper
Advertisement

Ali: తెలుగు చరిత్రలోనే పరమ చెత్త క్యారెక్టర్ అంటే ఇదే.. ఛీఛీ.. ఎలా పెట్టావయ్యా పూరి

Ali: తెలుగు చరిత్రలోనే పరమ చెత్త క్యారెక్టర్ అంటే ఇదే.. ఛీఛీ.. ఎలా పెట్టావయ్యా పూరి
Advertisement

Ali: బాలనటుడిగా ఆలీ కెరీర్ ను మొదలుపెట్టాడు. ఎన్నో మంచి చిత్రాల్లో నటించి మెప్పించాడు. కమెడియన్ గా బ్రహ్మానందం తరువాత అంతటి పేరు తెచ్చుకున్నాడు. ఒకానొక సమయంలో ఆలీ లేకపోతే అసలు సినిమా షూటింగ్ కూడా జరగని రోజులు ఉండేవి అంట. ఒక్కరోజే రెండు మూడు సినిమాల్లో నటించాల్సి వచ్చేది అంట. అంతలా బిజీగా ఉన్న కమెడియన్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక ఈ మధ్యకాలంలో సపరేట్ గా కమెడియన్స్ అవసరం ఉండడంలేదు. హీరోలే కామెడీ చేస్తున్నారు. అడపా దడపా సత్య లాంటి కమెడియన్స్ ను డైరెక్టర్లు వాడుతున్నారు. ఇక ఆలీ- పూరి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బద్రి నుంచి మొదలుకొని.. పూరి హిట్ సినిమాలన్నింటిలో ఆలీ కామెడీ హైలైట్ గా నిలిచేది. ఇక ఈ మధ్యకాలంలో పూరి హవానే కాదు ఆలీ హవా కూడా తగ్గింది.

Advertisement

చాలా గ్యాప్ తరువాత వీరి కాంబోలో వచ్చిన చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఇందులో ఆలీ మంకీ మ్యాన్ గా కనిపించాడు. సినిమా చూసిన వారిని ఇరిటేట్ చేసే పాత్ర ఏదైనా ఉంది అంటే అది ఇదే అని చెప్పాలి. మొత్తం బూతులు, సెక్స్ పదాలు తప్ప.. ఏమి లేదు ఈ పాత్రలో. కుటుంబం మొత్తం సినిమా చూడడానికి వెళితే.. చాలా వినకూడని పదాలను వినాల్సి వస్తుంది. దీంతో అభిమానులు పూరిపై గుర్రుమంటున్నారు.

అసలు ఈ క్యారెక్టర్ పెట్టాలని ఎవరికి అనిపించింది అన్న ప్రశ్నకు దొరికిన సమాధానం.. ఇది పూరి ఆలోచన కాదు.. ఈ కళాఖండాన్ని సృష్టించింది ఆలీనే. ఒక ఇంటర్వ్యూలో ఈ క్యారెక్టర్ తానే చెప్పినట్లు ఆలీ చెప్పుకొచ్చాడు. ఇలాంటి ఒక పాత్రను గతంలో ఎప్పుడో ఒకసారి చెప్తే ప్రభాస్ పగలబడి నవ్వాడట.

Advertisement

ఇక ఇన్నాళ్లకు పూరి దాన్ని సినిమాలో పెట్టినట్లు తెలిపాడు. అందుతున్న సమాచారం ప్రకారం.. ఆలీనే తన సీన్స్ ను డైరెక్ట్ చేసుకున్నాడని అంటున్నారు. ఇక ఈ క్యారెక్టర్ ను చూసిన వారందరూ.. తెలుగు చరిత్రలోనే పరమ చెత్త క్యారెక్టర్ అంటే ఇదే.. ఛీఛీ.. ఎలా పెట్టావయ్యా పూరి అని కామెంట్స్ పెడుతున్నారు. మరి పూరి దీనిపై స్పందిస్తాడేమో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×