E-Paper
Advertisement

Vishwak Sen: పాగల్ హీరోకు జపాన్ అభిమానులు.. డైరెక్ట్ గా ఆఫీస్ కు వచ్చి..

Vishwak Sen: పాగల్ హీరోకు జపాన్ అభిమానులు.. డైరెక్ట్ గా ఆఫీస్ కు వచ్చి..
Advertisement

Vishwak Sen: తెలుగు చిత్ర పరిశ్రమ.. పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకుంటుంది. మన హీరోలు.. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా గుర్తుపడుతున్నారు. బాహుబలి దగ్గరనుంచి మొదలైన ఈ గుర్తింపు.. ఇప్పుడు ప్రతి సినిమాకు పాకింది. ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలను జపాన్ లో రిలీజ్ చేస్తున్న విషయం తెల్సిందే.

ఎక్కువ రాజమౌళి.. తన సినిమాలను జపాన్ లో రిలీజ్ చేస్తాడు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలకు జపాన్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు అంటే అతిశయోక్తి కాదు. రానా , ఎన్టీఆర్, రామ్ చరణ్, అడివి శేష్ .. ఇలా వీరందరికి జపాన్ లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తాజాగా ఆ లిస్ట్ లో చేరిపోయాడు విశ్వక్ సేన్.

Advertisement

అవును.. మీరు వింటుంది నిజమే.. విశ్వక్ కు జపాన్ లో లేడీ ఫ్యాన్స్ ఉన్నారట. వారు.. విశ్వక్ ను కలవడం కోసం ఇండియా రావడమే కాకుండా విశ్వక్ ఆఫీస్ కు వెళ్లి సర్ ప్రైజ్ చేశారు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే విశ్వక్ సినిమాలను జపాన్ లో కూడా చూస్తారట. ఇక విశ్వక్ ను కలిసిన లేడీ ఫ్యాన్స్.. ఆనందాన్ని మాటల్లో వర్ణించలేకపోయారు.

విశ్వక్ ను చూడగానే వారు ఆనందంతో ఆశ్చర్యపోయారు. కొద్దిసేపు విశ్వక్ వారితో ముచ్చటించాడు. అనంతరం.. విశ్వక్ మీద ఉన్న ప్రేమను లేఖల రూపంలో చూపించారు. తాము కలెక్ట్ చేసిన ఫోటోలను, లెటర్స్ ను చూపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Advertisement

ఇకపోతే విశ్వక్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోవడంతో ఈసారి మంచి హిట్ కొట్టాలని విశ్వక్ చూస్తున్నాడు. మరి తన తదుపరి సినిమాలతో విశ్వక్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×