E-Paper
Advertisement

Double Ismart Day 1 Collections: డబుల్ ఇస్మార్ట్ Vs మిస్టర్ బచ్చన్.. కలెక్షన్లలో ఎవరిది పైచేయంటే..?

Double Ismart Day 1 Collections: డబుల్ ఇస్మార్ట్ Vs మిస్టర్ బచ్చన్.. కలెక్షన్లలో ఎవరిది పైచేయంటే..?
Advertisement

Double Ismart vs Mr Bachchan: ఆగస్టు 15 స్వాతంత్య్రం దినోత్సవం సందర్భంగా చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రామ్ పోతినేని, రవితేజ, విక్రమ్ వంటి స్టార్ హీరోలతో పాటు ఇప్పుడిప్పుడే మంచి ఫాంలోకి వస్తున్న నార్నే నితిన్ సినిమా కూడా థియేటర్లలో రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకుంది. ఈ నాలుగు సినిమాలు మొదట్నుంచి మంచి అంచనాలను క్రియేట్ చేసుకున్నాయి. పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ ఇలా ప్రతి ఒక్క అప్డేట్‌తో ప్రేక్షకాభిమానుల్ని విపరీతంగా అలరించాయి. ఇక అలాంటి అంచనాల నడుమ థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమాలు ఫస్ట్ డే ఎంతమేర కలెక్ట్ చేసాయో ఇప్పుడు తెలుసుకుందాం.

డబుల్ ఇస్మార్ట్

Advertisement

రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో భారీ అంచనాలతో తెరకెక్కిన సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ షో నుంచే ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఇందులో రామ్ ఎనర్జిక్‌ యాక్టింగ్‌తో అదరగొట్టేశాడని ప్రేక్షకులు చెప్పుకొస్తున్నారు. అలాగే కావ్యా థాపర్ తన బోల్డ్ లుక్స్‌తో సినీ ప్రియుల్ని కట్టిపడేసిందని అంటున్నారు. ఇక దర్శకుడు పూరి జగన్నాథ్ తన కథకు తగ్గట్టుగా నటీ నటుల్ని బాగానే వాడుకున్నాడని.. అయితే అక్కడక్కడ తన మార్క్ కనిపించలేదని చెప్పుకొస్తున్నారు. అయితే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద తొలి రోజు భారీ కలెక్షన్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు రూ.12.45 కోట్ల గ్రాస్ రాబట్టి అదరగొట్టేసింది.

DUBBLE ISMART

Advertisement

మిస్టర్ బచ్చన్

ఒక మంచి హిట్ కోసం రవితేజ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. గతేడాది ఒకటి రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ పెద్దగా ఆశించిన ఫలితం అందుకోలేకపోయాడు. ఈ సారి ఎలాగైన ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొడదాం అని దర్శకుడు హరీశ్ శంకర్‌తో చేతులు కలిపాడు. వీరిద్దరి కాంబోలో ‘మిస్టర్ బచ్చన్’ తెరకెక్కింది. ఫస్ట్ నుంచి ఎన్నో అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఫస్ట్ షో నుంచి మిక్స్ టాక్‌ అందుకుంది. కొందరేమో సినిమా సూపర్ అంటుంటే.. మరికొందరేమో అస్సలు బాగాలేదని.. దర్శకుడు హరీశ్ శంకర్ మార్క్ ఎక్కడా కనిపించలేదని చెప్పుకొస్తున్నారు. ఇక దీని కలెక్షన్ల విషయానికొస్తే.. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల మధ్య కలెక్షన్‌ను నమోదు చేసినట్లు తెలుస్తుంది.

తంగలాన్

విభిన్న పాత్రలు చేయడంలో ఎన్నడూ వెనకాడని నటుడు చియాన్ విక్రమ్. సినిమా ఏదైనా.. పాత్ర ఎలాంటిదైన ముందుంటాడు. సినిమా సినిమాకి తన వేరియేషన్స్ చూపిస్తుంటాడు. అలాంటి హీరో తాజాగా మరో కొత్త అవతార్‌లో కనిపించాడు. విక్రమ్, పా రంజిత్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘తంగలాన్’. ఆగస్టు 15న గ్రాండ్ లెవెల్లో విడుదల అయింది. ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వస్తుంది. ఫస్ట్ డే కలెక్షన్లలో దుమ్ముదులిపేసింది. ప్రపంచ వ్యాప్తంగా తంగలాన్ తొలి రోజు రూ. 26.44 కోట్ల గ్రాస్ వసూళు చేసి అదరగొట్టేసింది.

ఆయ్

ఇప్పుడిప్పుడే ఫాంలోకి వస్తున్న కొత్త నటుడు నార్నే నితిన్. ఎన్టీఆర్ బావ మరిదిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. తన తొలి మూవీ ‘మ్యాడ్’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత అతడు నటించిన మరో సినిమా ‘ఆయ్’. ఆగస్టు 15న రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా ప్రేక్షకుల్ని విపరీతంగా అలరిస్తుంది. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. అటు నార్త్ అమెరికాలోనూ మంచి బజ్ ఏర్పడటంతో తొలిరోజు రూ.2 కోట్లు కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×