BigTV English
Advertisement

Gold for Luck: ఈ రాశివారు బంగారం ధరిస్తే అదృష్టం కలిసివస్తోందట

Gold for Luck: ఈ రాశివారు బంగారం ధరిస్తే అదృష్టం కలిసివస్తోందట

Gold Zodiac Signs: జ్యోతిషశాస్త్రం ప్రకారం.. సూర్యుడికి, బంగారానికి అనుబంధం ఉంది. బంగారం సూర్యుడి నుంచి వచ్చే సానుకూల ప్రభావాలను మెరుగు చేస్తుందని చాలా మందికి నమ్మకం ఉంది. అలాగే శ్రేయస్సును కూడా కలిగిస్తుంది. బంగారు ఆభరణాలను ధరించినా, ఇంటిలో బంగారు వస్తువులను ఉంచినా సానుకూలమైన శక్తి వస్తుంది. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. బంగారం సంపద, హెదా, ఆధ్యాత్మికతకు చిహ్నంగా ఉంది. ముఖ్యంగా ఇంటిలో ఫంక్షన్లు, పెళ్లిళ్ల సమయంలో బంగారాన్ని కచ్చితంగా ధరిస్తారు.


కొన్ని రాశులవారు బంగారాన్ని ధరించడం వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని జ్యోతిషశాస్త్రం చెబుతుంది. ముఖ్యంగా ద్వాదశ రాశుల్లో 5 రాశులవారికి బంగారం అదృష్టం, అనుకూలతను తెచ్చిపెడుతుంది.

సింహరాశి

ఈ రాశివారికి బంగారం శుభప్రదమైనది. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సూర్యుడిచేత పాలించబడే అగ్ని చిహ్నంగా ఉంటుంది. వీరిపై సూర్యుడి ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ రాశివారు బంగారం ధరిస్తే.. ఆత్మగౌరవం పెరుగుతుంది. సృజనాత్మకత ప్రేరేపిస్తుంది. అభిరుచిని పెంచుతుంది. అదృష్టం, శ్రేయస్సును ఇస్తాయి. పాజిటివ్ వైబ్స్ వస్తాయి. వీరు పయనించే మార్గం బాగుంటుంది. చేపట్టిన ప్రతిపనిలోనూ విజయం సాధిస్తారు.


Also Read:పేరు మార్చుకుంటే కష్టాలన్నీ తొలగిపోతాయా.. సక్సెస్ సాధ్యమేనా? ఆస్ట్రాలజీ ఏం చెబుతోంది?

ధనస్సు రాశి

ధనస్సురాశివారికి ఆశావాద స్వభావం ఉంటుంది. వీరు బంగారాన్ని ధరిస్తే సాహసోపేతంగా ఉంటారు. కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. లగ్జరీ లైఫ్ పట్ల మొగ్గు చూపుతారు. కొత్త విషయాలను తెలుసుకోవడంలో ఆశ చూపిస్తారు. ఇతరుల నుంచి స్ఫూర్తి పొందుతారు. మరొకరికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు.

వృషభరాశి

ఈ రాశివారికి కూడా బంగారం శుభప్రదంగా ఉంటుంది. వారి లగ్జరీ, స్థిరతంపై ప్రభావం చూపుతుంది. చేసే పనిపట్ల సంకల్పాన్ని పెంచుతుంది. శ్రేయస్సు, అదృష్టాన్ని పెంచుతుంది. బంగారాన్ని ధరించడం వారి భావోద్వేగాలను స్థిరీకరిస్తుంది. సృజనాత్మకతను పెంపొందిస్తుంది. అందం, సౌకర్యంపట్ల అభిరుచిని పెంచుతుంది. అన్నిపనుల్లోనూ విజయం సాధిస్తారు. ప్రేమతో బంధాలను శాశ్వతం చేసుకుంటారు. ఆర్థికంగా స్థిరపడతారు.

తులారాశి

తులారాశివారికి బంగారం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అందం, సమతుల్యత, విలాసం, ప్రేమకు అనుగుణంగా ఉంటుంది. సహజంగానే ఇతరులను ఆకర్షిస్తారు. సామాజిక నైపుణ్యాలను పెంచుతుంది. సృజనాత్మకతను పెంపొందిస్తుంది. ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. న్యాయపరమైన భావాలను పెంపొందిస్తుంది. సోషల్ సర్వీస్, ప్రేమ, వృత్తి అన్నింటా సమానత్వాన్ని పాటిస్తారు.

మిథున రాశి

ఈ రాశివారు సహజంగానే తెలివిగా ఉంటారు. బంగారం ధరిస్తే.. మరింత తెలివిగా ఆలోచిస్తారు. కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంచుతుంది. శక్తిని ఇస్తుంది. సృజనాత్మకతను పెంపొదిస్తుంది. సామాజిక సంబంధాలను కూడా పెంపొందిస్తుంది. వీరిలో ముఖతేజస్సు బాగుంటుంది కాబట్టి సహజంగానే ఇతరులను ఆకర్షిస్తారు.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనికి ఎలాంటి బాధ్యత వహించదు.)

Related News

Vishnu Katha: మీ ఇంట్లోనే మహావిష్ణువు లక్ష్మీదేవితో కొలువుండాలంటే ఈ కథ చదవండి

Karthika Masam 2025: కార్తీక మాసం చివరి సోమవారం.. ఇలా పూజ చేస్తే శివయ్య అనుగ్రహం

Shani Puja: ఈ నాలుగు పనులు చేశారంటే శని దేవుడు మీ కష్టాలన్నీ తీర్చేస్తాడు

Vastu tips: మహిళలు నిలబడి చేయకూడని పనులు ఇవన్నీ.. చేస్తే పాపం చుట్టుకుంటుంది

Vastu tips: మీ ఇంట్లో ప్రతిరోజూ కర్పూరం వెలిగించడం వల్ల జరిగేది ఇదే

Vastu Tips: ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందా ? అయితే ఈ వాస్తు టిప్స్ పాటించండి !

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Big Stories

×