BigTV English

Double ISMART Teaser Review: ఇదేదో తేడా కొడుతుంది శీనా.. వర్క్ అవుట్ అయ్యేలా కనిపించడం లేదే..?

Double ISMART Teaser Review: ఇదేదో తేడా కొడుతుంది శీనా.. వర్క్ అవుట్ అయ్యేలా కనిపించడం లేదే..?

Ram Pothineni’s Double ISMART Teaser Review: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మరోసారి శంకర్ గా రాబోతున్నాడు. ఇప్పటివరకు రామ్ చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే.. ఇస్మార్ట్ శంకర్ ఒక ఎత్తు అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఎనర్జిటిక్ స్టార్ అనే ట్యాగ్ లైన్ నుంచి ఇస్మార్ట్ రామ్ అనే ట్యాగ్ యూ తీసుకొచ్చిపెట్టింది ఈ సినిమానే. అయితే ఈ సినిమా తర్వాత అంతటి హిట్ ను రామ్ అందుకున్నది లేదు.


గతేడాది వచ్చిన స్కంద కూడా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. దీంతో రామ్.. మళ్లీ హిట్ కొట్టాలంటే ఇస్మార్ట్ శంకర్ రంగంలోకి దిగాలని భావించి.. వెంటనే పూరి జగన్నాథ్ తో కలిసి ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ ప్రకటించారు. ఈసారి డబుల్ ఇస్మార్ట్ పేరుతో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను కూడా రంగంలోకి దించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా నేడు రామ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేసి రామ్ కు విషెస్ చెప్పారు.

టీజర్ అంతా మాస్ ఎలివేషన్స్ తో నింపేశాడు పూరి. తెలంగాణ భాషలో రామ్ అదరగొట్టేశాడు. అయితే ఈ టీజర్ పై సోషల్ మీడియాలో మిక్స్డ్ టాక్ నడుస్తోంది. టీజర్ సూపర్ ఉంది అని కొంతమంది అంటుంటే.. యావరేజ్ గా ఉంది అని ఇంకొంతమంది అంటున్నారు. మొదట్లో రామ్ తెలంగాణ యాసలో మాట్లాడినప్పుడు కూడా సినిమా పోయేలా ఉంది అనే టాక్ నడిచింది. కానీ, సినిమా రిలీజ్ అయ్యాకా.. రామ్ యాక్టింగ్ కు అభిమానులు ఫిదా అయ్యారు. ఇప్పుడు కూడా రామ్ కు ఇది వర్క్ అవుట్ అయ్యేలా కనిపించడం లేదని విమర్శలు మొదలుపెట్టారు.


Also Read: Serial Actress Sireesha: విడాకులు ప్రకటించిన ‘చెల్లెలి కాపురం’ సీరియల్ హీరోయిన్..

సంజయ్ దత్ విలనిజం, కావ్య అందాలు అంతా పూరి రొటీన్ రొట్ట కొట్టుడు లా ఉందని పెదవి విరుస్తున్నారు. టీజర్ చూసాక ఇదేదో తేడా కొడుతుంది శీనా.. వర్క్ అవుట్ అయ్యేలా కనిపించడం లేదే.. ? అని అంటున్నారు. మరి ఈ విమర్శలన్నీ పోయేలా పూరి- రామ్ ఇంకోసారి తమ తడాఖా చుపిస్తారేమో చూడాలి.

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×